Monday, May 5, 2025
- Advertisement -

అప్పుడే రెడ్డిలకు వార్నింగ్ ఇచ్చిన అన్నా రాంబాబు

- Advertisement -

రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీలో చేరిన అన్న రాంబాబు అప్పుడే తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. రెడ్డి సామాజిక వర్గాన్ని హింసించి, వేధించిన అన్న రాంబాబు అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ఇతను టిడిపిలో ఉన్నంత కాలం రెడ్లను ఇష్టం వచ్చినట్టు తిడుతూ,తప్పుడు కేసులు బనాయిస్తూ వాళ్ళను ఆర్థికంగా అణగదొక్కడానికి చేయని పనంటూ లేదు. అంతే కాకుండా రాష్ట్రంలోని ఏ రాజకీయ నాయకుడికి లేని చెడ్డపేరు ఈయనకే దక్కింది.

అంతేకాదు ఒక యువతిని వేధించిన కేసులో 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇదే మొదటిసారి అవుతుందేమో 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతూ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి ఒక పార్టీలో చేరడం, ఆ పార్టీ అధినేత పార్టీలోకి స్వాగతించడం .

పార్టీలో చేరిన రెండో రోజే తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడట. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలం మోహిద్దీన్ పురంలో కొందరు కార్యకర్తలు అన్న రాంబాబుని కలిసారంట. ఈ సమావేశంలో రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసాడని సమాచారం.రెడ్లకు హెచ్చరిక కూడా ఇచ్చినట్టు తెలిసింది. నాకు మద్దతు ఇవ్వకుంటే అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తానని. ఇది ఇప్పుడు గిద్దలూరులో తీవ్ర చర్చలకు దారి తీసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -