Tuesday, April 30, 2024
- Advertisement -

వైసీపీకి దూరమవుతున్న రెడ్లు..? నష్టం ఎవరికి..?

- Advertisement -

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. సామాజిక సమీకరణాలు లెక్కలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. అధికారంలోకి తీసుకురావాల‌ని క‌ల‌లుక‌న్న రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఇప్పుడు రెండు గా చీలిపోయి జ‌గ‌న్‌ కు వ్య‌తిరేకంగా పనిచేసున్నారు అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇప్పటికే నెల్లూరు పెద్ద రెడ్లు, అనంతపురం రెడ్లు టీడీపీ వెంట నడుస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగు తుందన్న ప్రచారం జరుగుతుంది. మరో పక్క టీడీపీ కూడా అధికారంలోకి వస్తే ముఖ్య పదవులు, కాంట్రాక్టులు ఇస్తామంటూ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుంది. రెడ్లకు వైసీపీలో విలువ లేదంటు ప్రచారం చేస్తుంది.

రెడ్లకు టీడీపీ లోకి వెళ్లడం కొత్తేమీ కాదు ఇది టీడీపీ పార్టీ పెట్టినప్పటినుండి జరుగుతున్నదే. అయితే రెడ్లు వైసీపీకి దూరమైతే ఎవ్వరికి నష్టం జరుగుతుంది అనే చర్చ జరుగుతుంది. చంద్రబాబు వాడుకొని వదిలేసే రకం అని అందరికి తెలిసిన విషయమే. ఎందుకంతే గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అపాయింట్మెన్ కూడా ఇవ్వడు. టీడీపీ లో ఎంత విలువ ఇస్తుందో రేవంత్ రెడ్డి ని, మాధవ రెడ్డి ని చూస్తే తెలుస్తుంది.

రెడ్లు వైసీపీ ని వీడి వేరే పార్టీల్లో చేరడం ఇప్పుడు జరుగుతున్నా వింత కాదు… రెడ్లకు రెడ్లు మాత్రమే పోటీదారులు అందుకే ఒక రెడ్డి పోతే అదే నియోజకవర్గం నుండి లేదా అదే ఊరు నుండి ఇంకో రెడ్డి వైసీపీలో జాయిన్ అవుతాడు, దీనివల్ల పార్టీ కి వచ్చే నష్టం ఏమీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read: టీడీపీ, జనసేన పొత్తు…. బీజేపీ గేమ్ ప్లాన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -