Saturday, May 11, 2024
- Advertisement -

బర్త్ డేకి కోటి ఖర్చు.. వైసీపీ ఎమ్మెల్యే భోగం

- Advertisement -

ఆగస్టు 2.. నిన్ననే.. ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పుట్టిన రోజు అది. ఇంకేముంది.. మొత్తం సర్వం సిద్ధమైందట.. బాగా హంగామా జరిగిందట.. ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసి బర్త్ డే నిర్వహించారన్న వార్త ఇప్పుడు జిల్లాలో అందరి చెవిల్లో కోడై కూస్తోంది.

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా రాంబాబు బర్త్ డే వేడుకలు అదిరిపోయేలా నిర్వహించారట.. దానికి అందరి దగ్గర నుంచి విరాళాలు కూడా సేకరించారట.. అవే దాదాపు కోటి రూపాయలు అయ్యాయని సమాచారం. ప్రభుత్వ శాఖల నుంచి, గ్రామ వలంటీర్ల పోస్టులు ఇప్పిస్తామని లబ్ధిదారుల నుంచి ఆయన అనుచరులు ఈ మొత్తాన్ని వసూలు చేశారట.. ఇక నియోజకవర్గ ఎమ్మెల్యే బర్త్ డే కావడంతో సహజంగానే వ్యాపారులందరూ భారీగానే ఖర్చుకు విరాళం ఇచ్చారట.. ఇలా మొత్తం కోటి రూపాయలు వసూలు చేసి ఎమ్మెల్యే అన్నా రాంబాబు బర్త్ డేను నభూతో నభవిష్యతి అన్న చందంగా ఘనంగా నిర్వహించారని జిల్లాలో చర్చ జరుగుతోంది.

ఒకవైపు సీఎం జగన్.. తన ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతికి దూరంగా ఉండాలని.. పారదర్శక పాలన కోసం ‘జ్యూడిషియల్ కమిషన్లను’ ఏర్పాటు చేసి నీతినిజాయితీగా పాలిస్తూ ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు తమ పుట్టిన రోజు నాడు మొక్కలు నాటాలని.. అన్నార్థులకు సాయం చేయాలని.. పేదలకు దానధర్మాలు చేయాలని సూచిస్తున్నాడు. కానీ ప్రకాశం జిల్లాలోని అధికార వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాత్రం ఏకంగా తన నియోజకవర్గంలో వివిధ వర్గాల నుంచి కోటి రూపాయలు వసూలు తాన తందాన హంగామా చేయడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారిందట.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా జగన్ వరకు వెళ్లినట్లు సమాచారం.

దీంతో అధిష్టానం నుంచి ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు పెద్దక్లాస్ పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈయన పుట్టినరోజుకు ఏర్పాట్లు చేసిన.. విరాళాలు చేసిన వారికి ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయట.. ఎమ్మెల్యేను మచ్చిక చేసుకొని నియోజకవర్గంలో దందా చేద్దామనుకున్న వారికి వైసీపీ అధిష్టానం హెచ్చరికలతో కుడిదలో పడ్డ ఎలుకలా పరిస్థితి తయారయ్యిందట..

మొన్నటికి మొన్న ఇదే ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన ‘వైఎస్ఆర్ జయంతి’ని పట్టించుకోలేదట.. ఇప్పుడు తన బర్త్ డేను మాత్రం కోటి రూపాయలు వసూలు చేసి చేసుకున్న ఘనంగా చేసుకున్నారన్న వార్త బయటకు పొక్కింది. ఈ విషయాన్ని ఆరా తీసిన ఇంటెలిజెన్స్ జగన్ కు సమాచారం కూడా అందించిదని సమాచారం. ప్రజలకోసం రూపాయి ఖర్చు చేయలేని ఈ నేత తన బర్త్ డే కు మాత్రం కోటి ఖర్చు చేయడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయాంశం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -