సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని సినిమా ల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఈ ఎన్నికలలో గట్టి దెబ్బ తగిలింది.. రెండు నియోజక వర్గాల్లో గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ మొత్తానికి ఒక సీటు ను మాత్రం గెలుచుకుని దేవుడా అనుకుంటూ బయట పడ్డాడు. ఇక రాజకీయాల్లో చేసేదేం లేక మళ్ళీ సినిమా బాటపట్టిన పవన్ కళ్యాణ్ పార్ట్ పొలిటిషన్ అనే పేరు ను మోస్తూ మళ్ళీ ఎన్నికలనాటికి అవసరమయ్యే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తో పవన్ జత కట్టిన సంగతి తెలిసిందే.. అందులోనూ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మెగా ఫ్యామిలీ బాగా దగ్గర.. వాస్తవానికి సోము కి ఈ పదవి వచ్చింది కూడా వీరి సిఫారసు వల్లే అన్న అభిప్రాయం కొంతమంది లో ఉంది..
ఇదిలా ఉంటే సినిమాల్లోని తన మ్యానరిజం ని రాజకీయాల్లో కూడా చూపించడం పవన్ కు అలవాటు.. ఆవేశంతో ఊగిపోవడం, పిడికిలి బిగించి ఆకాశానికి చూపించడం, జుట్టు సరిచేసుకుంటూ ముందుకు నడవడం, అప్పుడప్పుడు సిగ్గుపడటం, ఆ వెంటనే తన చిన్నప్పటి సంగతులతో నవ్వించడం.. ఇలా సీరియస్ గా ఉండే రాజకీయాలను ఫన్నీ చేసేసి ప్రజలకు వినోదం పండించేవారు పవన్ కళ్యాణ్.. అయితే సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు ఇది చాలా మిస్ అవుతున్నారట.. లాక్ డౌన్ లో దీపాలు వంటి కార్యకలాపాలతో తన ఉనికిని చాటిన ఆ తర్వాత పవన్ ని ప్రజలు చాలా మిస్ ఆవుతున్నారట..
అయన సినిమాల్లోకి వెళ్లిన తరువాత సగటు ప్రేక్షకుడికి కూడా పవన్ కల్యాణ్ లేని లోటు బాగా తెలిసొచ్చింది. అటు కరోనా టైమ్ లో సినిమాలు లేక, ఇటు పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి జనాల మధ్య లేక.. అసలు తెలుగు ప్రేక్షకుడికి వినోదం అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఇప్పటికైనా పవన్ బైటకు రావాలని, ఆయన ఇన్నాళ్లూ జనాల మధ్య లేని లోటు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.ఇక పవన్ ని కూడా బీజేపీ వాడుకోవాలని జనసేన తో జట్టు కట్టింది అంటున్నారు. ఎన్ని ఉన్నా ఒక ప్రత్యేక ఆకర్షణ బీజేపీ కి కరువైంది. టీడీపీ లో చంద్రబాబు లా, వైసీపీ లో జగన్ లా , జనసేన లో పవన్ ఓ నాయకత్వ లేమి , సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది.. దానిపై దృష్టి సారించిన బీజేపీ అభిమానం బలం, ప్రజల్లో మంచి భావన ఉన్న పవన్ తో జట్టు కట్టి ముందుకు వెళ్తుది.. మరి ఇది పవన్ కళ్యాణ్ కి ఏవిధంగా హెల్ప్ అవుతుందో చూద్దాం..
చంద్రబాబు తీరు టీడీపీ ఎమ్మెల్యేల కు నచ్చలేదా..?
చంద్రబాబు కు జగన్ అంటే ఎందుకింత అసూయా…!