Thursday, March 28, 2024
- Advertisement -

చంద్రబాబుకు మొండివైఖరి ఎంటి..?

- Advertisement -

మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి చాల అధ్వాన్నంగా తయారైందన్న సంగతి తెలిసిందే.. ఒక్కొక్కరు గా టీడీపీ పార్టీ ని వీడుతూ చంద్రబాబు ను ఒంటరి చేస్తున్నారు.. వాస్తవానికి జగన్ ప్లాన్ కూడా అదే.. ఇప్పటివరకు తనమీద తీర్చుకున్న పగని జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఇలా పార్టీ కి ఒక్కొక్కరిని దూరం చేస్తూ పార్టీ పునాదులు లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు.. ఇప్పటికే దాదాపు టీడీపీ లో మెయిన్ మెయిన్ లీడర్లు అందరు దూరమైపోయారు. ద్వితీయ శ్రేణి లీడర్లతో చంద్రబాబు తన పార్టీ ని నడిపించుకోవాలి.. ఓ కొత్త నాయకుడు వస్తే గానీ టీడీపీ గెలుస్తుందన్న ఆశలు ఇకపై సజీవంగా ఉండవు.. చంద్రబాబు కి  75 ఏళ్ళు పైబడిపోవడంతో ఇకపై పార్టీ నిడిపించే ఆలోచనలో అయన లేనట్లు తెలుస్తుంది..

పోనీ లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పజెబుదామా అంటే లోకేష్ వద్దని సొంత పార్టీ నేతలనుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.. లోకేష్ పార్టీ బాధ్యతలు అప్పగించే సమయం ఇంకా ఉందని, రాజకీయంగా లోకేష్ ఇంకా ఎదగాల్సి ఉందని ఒకవేళ తొందరపడి ఇప్పుడు లోకేష్ పగ్గాలు అప్పజెప్తే పార్టీ భవిష్యత్ లో కనపడదని అంటున్నారు.. ఇదిలా ఉంటే చంద్రబాబు కు తనకు మంచి చెప్పినా తీసుకునే స్థితిలో లేదు.. ప్రస్తుతం భారీ వర్షలు కురుస్తున్నాయి.. ఏపీని, తెలంగాణ ను అతకుతలం చేస్తున్న ఈ వానలు క‌ర‌క‌ట్టలో ఒకింత భారీగా ఉన్నాయని చెప్పొచ్చు.. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటికి.. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల కట్టలేరు, మున్నేరు, కొండవాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

అయితే కరకట్ట లోని చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు నోటీసులిచ్చారు. చంద్రబాబుతో పాటు మరో 36 ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. భారీ వరద వస్తుండటంతో కరకట్ట దగ్గర ఉన్న నివాసాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో అధికారులు కోరారు. సెప్టెంబర్‌లో కూడా చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చారు. గతేడాది కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరిగింది. అప్పుడు కూడా చంద్రబాబుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలని కోరారు. కానీ అప్పుడు ఇప్పుడు చంద్రబాబు అధికారులు నోటీసులను పట్టించుకోవట్లేదు.. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేగేలా ఉంది.

తెలంగాణా లో ఆ పార్టీ అసలు ఉందా లేదా..?

టీడీపీ కి ఈ విషయంలో అంత అత్యుత్సాహం ఎందుకు..

అడ్డదారులు వెతుకుతున్న చంద్రబాబు..

చంద్రబాబు కు తమ్ముళ్ళను కలిసే టైం కూడా లేదా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -