Saturday, May 4, 2024
- Advertisement -

ర‌జ‌నీ కోసం ఉద్యోగానికి రాజీనామా

- Advertisement -

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ క్రియేటివ్ హెడ్ రాజీనామా

త‌మిళ‌నాడులో ఇప్పుడు అంత‌టా ర‌జ‌నీకాంత్ పేరే వినిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌కంప‌న‌లు రేగుతున్నాయి. రాజ‌కీయ పార్టీల్లో గుబులు పుట్టింది. ఇప్పుడు ఆయ‌న‌కు అభిమానం రోజురోజుకు పెరుగుతోంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ తన రాజకీయ రంగప్రవేశం చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో తమిళనాడులో చాలా మంది రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడుతున్నారు.

అయితే ఆయ‌న‌కు సినీ నటులు కూడా మ‌ద్దతు ప‌లుకుతున్నారు. రాజు మహాలింగం అందరి కన్నా ఒక అడుగు ముందుకి వేసి తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. త‌న జీవితమంతా ర‌జ‌నీతో ఉంటాన‌ని, ఆయనతో పాటుగా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్ర‌క‌టించాడు. ఆయ‌నెవ‌రో కాదు రజినీ నటిస్తున్న రోబో-2 సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో క్రియేటివ్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. సినిమాకు ప‌నిచేసే క్రమంలో మూడేళ్లుగా రజినీకాంత్‌తో పరిచయం ఉండడం, ఆయనని దగ్గరి నుంచి గమనించడం వల్ల ఆయన ఎటువంటి మనిషి అన్నఅవగాహన ఉండడంతోనే తాను ఇలా రాజీనామా చేశాను అని తెలిపాడు. ఇక రజినీకాంత్‌తో పాటే తన జీవితం కొనసాగనుంది అని ప్రకటించాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -