Thursday, May 16, 2024
- Advertisement -

దీపిక‌, ర‌ణ్‌వీర్‌సింగ్ పెళ్లంట‌

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ వివాహం భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో జ‌ర‌గ్గా ఈ హాట్ టాపిక్ బాలీవుడ్‌లో కొన‌సాగుతోంది. ఈ ముచ్చ‌ట మ‌రువ‌నే లేదు కానీ మ‌రో జంట వివాహం ఉండ‌బోతోంద‌నే పుకార్లు షికార్లు చేస్తున్నారు. సిక్స్‌ప్యాక్‌తో రొమాన్స్‌తో విజృంభించే ర‌ణ్‌వీర్‌సింగ్ త‌న‌తో న‌టించిన దీపిక ప‌దుకునే త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్నారంట‌.

బాలీవుడ్‌లో హాట్‌ పెయిర్‌గా ముద్ర‌ప‌డిన రణ్‌వీర్‌ సింగ్‌, దీపిక పదుకునేలు త్వరలో పెళ్లి చేసుకోనున్నార‌నే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. జ‌న‌వ‌రి 5వ తేదీన (శుక్రవారం) రణ్‌వీర్‌, దీపికలకు శ్రీలంకలో నిశ్చితార్థం జరగనుందని టాక్ వినిపిస్తోంది. జ‌న‌వ‌రి 5వ తేదీ శుక్రవారం దీపిక జ‌న్మ‌దినం కూడా. ఈ సంద‌ర్భంగా ఒక్క‌ట‌వుతార‌ని చెబుతున్నారు. రణ్‌వీర్‌-దీపిక ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. న్యూ ఇయర్‌ వేడుకలకు మాల్దీవులకు వెళ్లిన దీపిక, రణ్‌వీర్ అక్కడి నుంచి ఇరువురి కుటుంబసభ్యులతో కలసి శ్రీలంకలకు వెళ్లనున్నట్లు స‌మాచారం. నిశ్చితార్థం తర్వాత కొద్దిరోజుల్లోనే వివాహ వేడుక కూడా ఉంటుందని సమాచారం.

ప్ర‌స్తుతం ఈ జంట క‌లిసి ప‌ద్మావ‌తి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వివాదాల‌తో విడుద‌ల వాయిదా ప‌డింది. ఆలోపు వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యే అవ‌కాశం ఉంది. రామ్‌లీల సినిమాలో వీరిద్ద‌రూ ఆ సీన్ల‌లో రెచ్చిపోయి మ‌రీ న‌టించారు. అప్పుడే అంద‌రూ ముద్ర వేశారు వీరిద్ద‌రూ ల‌వ్‌లో ఉన్న‌ట్టు..

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -