కీసర ఎమ్మార్వో అవినీతి కేసు లో పెద్ద పెద్ద నాయకుల పేర్లు బయటకి వస్తున్న నేపథ్యంలో ఈ కేసు పై అందరి దృష్టి పడింది.. కోటాను కోట్లు అవినీతి జరగగా ఈ కేసు తెలంగాణ లోనే ఒక ప్రభంజనం సృష్టించేలా ఉంది.. ఈ విషయంపై కేసీఆర్ కూడా దృష్టి పెట్టి కేసు పూర్వోపదాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధికారులతో మాట్లాడి ఈకేసులో ఎవరున్నా వదిలిపెట్టొద్దు, అవినీతి ని కూకటివేళ్లతో సహా పీకేయాలని వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట.. అయితే ఇందులో ఓ కాంగ్రెస్ ఎంపీ ఇన్వాల్వ్ అయ్యాడనే వార్త ఇప్పుడు రాష్ట్రమంతటా సంచలనం సృష్టిస్తుంది.
ఆ ఎంపీ ఎవరో కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అని ఆయనకు ఈ కేసు లో ఉన్న పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు.దీంతో ఈ కేసు మరింత వేగంగా ఓ కొలిక్కి వచ్చేలా పనిచేస్తామని అంటున్నారు.. సర ఎమ్మార్వో కోటి రూపాయల లంచం కేసులో ఏసీబీ వైఖరి ఇలా వేగం గా ఉంటే తొందరలోనే అసలు అవినీతి బకాసురులు పెట్టుకోవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
ఒక వేళా ఈ కేసులో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడని ఏవైనా వార్తలు లభిస్తే అతన్ని కూడా విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ స్పష్టం చేశారు. ఇక నాగరాజు బ్యాంకు లాకర్లపై ఎలాంటి స్పష్టత రాలేదని ఎసిబి విచారణకు నిందితులు సహకరించలేదని చెప్పారు.. తహసీల్దార్ నాగరాజు ఆయన భార్య ఇద్దరు కలిసి లాకర్ల విషయంలో తమని తప్పుదోవ పట్టించారని తెలిపారు. శ్రీనాథ్ డబ్బులు వరంగల్ నుంచి తీసుకువచ్చినట్లు , అవి లంచం కోసమే తెచ్చినట్లు అంగీకరించాడని సూర్యనారాయణ వెల్లడించారు