Saturday, May 4, 2024
- Advertisement -

అలా చేస్తేనే అప్పు.. లేదంటే లేదు.. జగన్ కు కేంద్రం కండిషన్..?

- Advertisement -

కరోనా.. ఈ పేరు వింటే అందరికి కాళరాత్రి లో విహరించినట్లుగా ఉంటుంది.. ఈ రోగం వ్యక్తి కి వచ్చే మాట అటుంచితే దీనివల్ల ఆర్థికంగా అందరు చాల నష్టపోయారు.. సామాన్య మానవుని నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఎంతో నష్టం వాటిల్లింది.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సమస్య ను అధిగమించడానికి ప్రభుత్వ భూములను ఫ్లాట్స్ గా చేయడానికి నిర్ణయం తీసుకుంటుంది.. అయితే జగన్ ప్రభుత్వం కూడా ఆర్థిక సమస్య ను పరిష్కరించడానికి ఓ నిర్ణయంతీసుకుంది.. వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గా వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు కేంద్రానికి సమాచారం కూడా ఇచ్చిందని, ఇప్పటికే జీతాలు, వగైరా వగైరా ఖర్చులు తీరాలంటే ఇది చేయక తప్పదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.. ఇప్పటికే ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది, అప్పులు పుడితే తప్ప రోజువారీ ఖర్చులు గడవని పరిస్థితి, ఒకవేళ చేద్దామన్న కూడా గతంలోని అప్పులే కొండలుగా ఉన్నాయి ఈనేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదని చెప్తున్నారు.. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం కేంద్రం పెట్టిన షరతుకు తలొగ్గే గతిలేక ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది..

చట్టం ప్రకారం కేందం దగ్గర ఋణం నిర్దేశించిన దానికంటే ఎక్కువ తీసుకోవాలంటే ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి ఐదు శాతం కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ ఆ రుణ పరిమితి పెంచుకోవాలంటే కేంద్రం పెట్టిన కండిషన్స్ ఫాలో అవ్వాలి.. దానికి గాను కేంద్రం పెట్టిన షరతు.. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయడం.ఇలాంటి పరిస్థితుల్లో దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని చెబుతున్నారు. ఈ ప్రాసెస్ జరిగితే రాష్ట్రానికి ఓ ఇరవైవేళ్ళ కోట్లు అప్పు ను ఇస్తుంది. అయితే ఒకవేళ ప్రజలు బిల్లులు చెల్లించిన ఆ పైకాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని అంటున్నారు.. త్వరలోనే విద్యుత్ బిల్లు ను ఎత్తివేసి ఆ పైకాన్ని తిరిగి ప్రజల ఖాతాల్లోకి జమచేస్తామని ప్రకటించే అవకాశం ఉంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -