Friday, March 29, 2024
- Advertisement -

పుష్ప విషయంలో మైత్రి సుక్కు కు అండగా ఉంటుందా..?

- Advertisement -

సుకుమార్ కి ఈమధ్య విమర్శలు ఎక్కువైపోతున్నాయి.. రంగస్థలం తో మంచి హిట్ కొట్టడనుకున్న సంతోషం కొంత సేపైనా ఉండలేదు.. మహేష్ బాబు తో సినిమా ని ఒకే చేయించుకుని ఆరునెలలు గడవకముందే ఆ సినిమా అటకెక్కేసింది. సిల్లీ రీజన్ చెప్పి మహేష్ ఆ సినిమా ని క్యాన్సిల్ చేసేశాడు. వెంతంటే తనకు అసికొచ్చిన అల్లు అర్జున్ తో సినిమా ని అనౌన్చే చేసి ఆ సినిమా పనులను చక చక పూర్తి చేస్తున్నాడు సుకుమార్.. లాక్ డౌన్ లోనూ సినిమా మీద పనిచేస్తూ సినిమా మీద అంకిత భావాన్ని చూపించాడు.. అందుకు తగ్గట్లే ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక అంత బాగానే జరుగుతుందన్న సమయంలో సడెన్ గా ఓ రచయిత నాదే కథ అంటూ ముందుకు రావడం తో సుకుమార్ పై అందరికి అనుమానాలు మొదలయ్యాయి.. గతంలో సుకుమార్ విష్యంలో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు రాలేదు.. పైగా తన ట్రంకు పెట్టె నిండా చాల కథలున్నాయి అని స్టేట్మెంట్ లు కూడా ఇచ్చాడు.. అలా నేను నా చేతికి అందిన ఓ కథ నే పుష్ప సినిమా గా తీస్తున్నానని ఛేఫున్నా సదరు రచయిత మాత్రం ఈ కథ నాది అంటూ గట్టిగా వాదిస్తున్నాడు.. టీవీ చానళ్ళు, యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆ రచయిత తన గళాన్ని వినిపిస్తున్నాడు.. పుష్ప కథని నేను మైత్రి మూవీ మేకర్స్ వారికి చెప్పను దాన్ని సుకుమార్ కి చెప్పి బన్నీ తో సినిమా చేస్తున్నారని ఆరోపించారు..

దీనిపై మైత్రీ మూవీస్ స్పందించింది. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు అంటూ కొట్టి పారేసింది. ఆ క‌థ బాలేదు. ఆ విష‌యం మేం ముందే చెప్పేశాం. బాగోలేని క‌థ మేమేం చేసుకుంటాం అంటూ.. ఆ ర‌చ‌యిత గాలి తీసేసింది.. అయితే ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి సామాన్య మైన వాడేం కాదు, కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు విజేత‌. త‌మిళ కూలీ క‌థ చ‌దివిన‌వాళ్ల‌కెవ‌రికైనా పుష్ష‌ ఈ క‌థేనేమో అనిపించ‌క‌మాన‌దు. మరి ఈ చిక్కుముడి వీడాలన్నా, ఈ కథ ఎవరిదో తెలియాలన్నా ఒక్కసారి ఈ కథల రిజిస్ట్రేషన్ డేట్ లు చూడాలి.. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఆచార్య విషయంలోనూ గట్టిగ స్పందించింది.. కనుక పుష్ప విషయంలోనూ సుకుమార్ కి మైత్రి అండగా ఉంటుందని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -