Thursday, May 16, 2024
- Advertisement -

త‌న భ‌ర్తను ఓ ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారు – రేవంత్ భార్య‌

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది పార్టీల‌లో టెన్ష‌న్ మొద‌లైంది.దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కొడంగ‌ల్ పోలీసులు మంగ‌ళ‌వారం ఉద‌యం అరెస్ట్ చేశారు. కొడంగల్ లో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సభను అడ్డుకుంటామని ప్రకటించిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ సభను అడ్డుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు బద్దలుగొట్టి మరీ పోలీసులు లోపలికి వచ్చారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని బ‌ల‌వంతంగా స్టేష‌న్‌కు త‌ర‌లించిన‌ట్లు తెలుస్తుంది.

అయితే ఆయ‌న‌ను ఏ పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్లారో మాత్రం తెలియ‌డం లేదు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే స‌మ‌యంలో ఆయన భార్య గీత అక్కడే ఉన్నారు. మరోవైపు తన భర్తను అర్థరాత్రి ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారని రేవంత్ రెడ్డి భార్య గీత ఆరోపించారు. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదని వాపోయారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ విష‌యం తెలుసుకున్న కాంగ్రెస్ హైక‌మాండ్ రేవంత్ భార్య‌తో మాట్లాడారు. రాహుల్ గాంధీ సూచ‌న మేర‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గీతకు ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు తెలుస్తుంది.పార్టీ అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని హమీ ఇచ్చార‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -