Monday, June 17, 2024
- Advertisement -

పవన్‌పై శకలక శంకర్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు నటుడు షకలక శంకర్. వాస్తవానికి పవన్‌కు వీరాభిమాని శంకర్. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నారు.అయితే తాజాగా శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈసారి ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుండి పోటీచేయగా సెలబ్రిటీలు పోటెత్తారు.కానీ 2019 ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారానికి పెద్ద సెలబ్రెటీలు ఎవ్వరు రాలేదు. అయితే శ్రీకాకుళంలో షకలక శంకర్ ఒక్కరే పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం నిర్వహించారు. తన సొంత ఖర్చులతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శంకర్.. ఇందుకోసం జనసేన కార్యకర్తలకు, పవన్ అభిమానులకు రూ. 3 లక్షలతో భోజనాలు పెట్టించానని వెల్లడించారు.

చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయాయి. తన సినిమాల కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ని ఖర్చు చేశా…అయితే తన ఫ్యామిలీ వాళ్లు డబ్బులు తెస్తున్నానని ఎదురుచూశారన్నారు. చివరకు మా ఫ్రెండ్ ఇచ్చిన వెయ్యితో ఇంటికి వెళ్లా ఆ తర్వాత డబ్బులు ఖర్చు చేశానని మా ఆవిడ నాలుగు రోజులు మాట్లాడలేదని చెప్పారు శంకర్. మా ఇంట్లో అడిగిన వాళ్లు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదని.. పవన్ పై ప్రేమతో ఇంత చేశావు… ఆయన కనీసం నీకు ఫోన్ చేశాడా? అని చెప్తే తన దగ్గర సమాధానం లేదని చెప్పారు. ఒకవేళ తాను సాయం చేసినట్లు పవన్‌కు తెలిసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -