Monday, April 29, 2024
- Advertisement -

ఆ వైసీపీ మంత్రి పై తిరుగుబాటు చేయక తప్పదా..?

- Advertisement -

వైసీపీ పార్టీ లో జగన్ గెలిచి ముఖ్యమంత్రి అయితే అయ్యారు గానీ అందరు ఎమెల్యేలు ఆయనలా మంచివారే అయి ఉంటారని అనలేం.. తమ తమ రాజకీయ సమీకరణాల దృష్ట్యా జగన్ అక్కడి స్థానిక నేతలకు అయితే సీటు ఇవ్వగలిగారు కానీ వారు గుణగనాలు చూసి సీట్ ఇచ్చే టైం అయితే జగన్ కి లేదని చెప్పాలి.. ఎ పార్టీ కి అయినా ఇది పెద్ద తలనొప్పి గా మారే విషయమే.. గెలిచిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థంకాని పరిస్థితి.. తాజగా వైసీపీ తరపున గెలిచి మంత్రి అయిన  శంకర నారాయణ తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు.

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనపై సొంత పార్టీ నేతలనుంచి తీవ్రమైన అభ్యంతరాలు నెలకొంటున్నాయి.. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా బీసీ కోటాలో శంకరనారాయణకు మంత్రిపదవి దక్కింది.  ఎంతో మంది సీనియర్ లను కాదని, పార్టీ కోసం కృషి చేసిన వారిని కాదని శంకరనారాయణకు సీటు ఇవ్వడమే కాకుండా మంత్రి పదవి ఇవ్వడం ఒకరకంగా అయన అదృష్టమని చెప్పాలి..  వాస్తవాలు చెప్పాలి అంటే మంత్రి శంకరనారాయణకు స్థానికంగా ఉన్న  గంపల రమణారెడ్డికి కొన్ని రోజులుగా పొసగడం లేదని చెప్పాలి..

మొదటినుంచి పార్టీ కోసం పనిచేసిన తనకు నియోజకవర్గంలోని పార్టీ తరపున అన్ని పెత్తనాలు ఉంటాయని భావించగా మంత్రి గారు అడ్డు తగలడం ఆయనకు ససేమీరా నచ్చడం లేదని తెలుస్తుంది. ఆ కోవలోనే మంత్రి శంకరనారాయణ తనను పట్టించుకోకపోవడంతో రమణారెడ్డి వేరు కుంపటి పెట్టుకున్నారు. తనకు కాంట్రాక్ట్ పనులు ఇవ్వకుండా ఉండడంతో పుండు మీద కారణం చల్లినట్లవుతుంది  గంపల రమణారెడ్డికి ..దాంతో మంత్రికి వ్యతిరేకంగా ఉన్న జిల్లా ఎమ్మెల్యేలను గంపల రమణారెడ్డి కలుస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మంత్రి శంకరనారాయణకు వ్యతిరేకంగా రమణారెడ్డి వర్గాన్ని వెనకుండి ప్రోత్సహిస్తున్నారు. దీంతో పెనుకొండ నియోజకవర్గం వైసీపీలో మంత్రి వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్లు పార్టీ పరిస్థితి తయారయిందనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -