Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు కు ఈ జబ్బు మొదటినుంచి ఉన్నదే..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిపోతాను అని ఇంకా చంద్రబాబు కళలు కనడం ఒకింత విడ్డూరంగా ఉన్నా అయన మంకుపట్టు చూస్తుంటే ప్రజలకు నవ్వు టో పాటు ఆశ్చర్యం కలిగిస్తుంది.. అయితే ప్రజలు చెప్పిన తీర్పును కాదని చంద్రబాబు ఏమీ చేయలేడు.. ఎన్నికలు జరిగి రెండేళ్ళు కావస్తుంది.. ఇంతలోనే జగన్ పై ప్రజలకు వ్యతిరేకత రావడం అసంభవం.. కనీ చంద్రబాబు అప్పుడే ఎన్నికలు వస్తే తమ సత్తా చాటుతాం అంటూ లేని పోనీ సవాళ్ళు చేస్తూ ముఖ్యమంత్రి అయిపోవాలని పగటి కళలు కనడం ఇప్పుడు అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది..

ఇప్పటివరకు మంచి పాలన అందిస్తున జగన్ ఒకవేళ ఎన్నికలకు వెళితే వ్యతిరేకత లేనందున మళ్ళీ ఆయనే గెలిచే సూచనలున్నాయి.. అయితే టీడీపీ కి ఆ 23  సీట్లు కూడా లేకుండా చేస్తాడా అనేది చూడాలి.. అయినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు అంటే కుదరని పని. అయినా ఏం అంత కొంపలు మునిగిపోయాయని చంద్రబాబు ఎన్నికలు కోరుకుంటున్నారో అర్థం కావట్లేదు.. జమిలి ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వం బండారం బయటపడుతుందని చంద్రబాబు అంటున్నారు. అంటే జమిలి ఎన్నికలు వస్తాయన్న ఆశతో ఇంకా చంద్రబాబు ఉన్నారని అర్థమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు పెట్టాలని తొలుత భావించింది. ఈ మేరకు కసరత్తులు కూడా చేసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ జమిలి ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా? అన్నదే ప్రశ్న. ప్రస్తుతం కరోనా దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. రాష్ట్రాలు కూడా పూర్తిగా ఆర్థికనష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాలు జమిలి ఎన్నికలకు అంగీకరించే పరిస్థితి లేదన్నది వాస్తవం. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అంత త్వరగా జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దాంతో ఈ జమిలి ఎన్నికలు వస్తాయని కలలు కన్న చంద్రబాబు కు ఇది పెద్ద కలగానే మిగిలిపోయింది.. జమిలి ఎన్నికలు వచ్చినట్లు గెలిచినట్లు పగటి పూట కూడా కళలు కన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇంకా ఎన్ని వేషాలు వేస్తారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -