Saturday, May 25, 2024
- Advertisement -

నెల్లూరి రెడ్డిగారి దెబ్బకు ఆర్ కే నగర్ విలవిల

- Advertisement -

విశాల్ రెడ్డి. నిర్మాత జికె రెడ్డి చిన్న కుమారుడు. ఎన్నో కష్టాలు పడి.. నెల్లూరునుంచి మద్రాసి పట్టణానికి వెళ్ళిన జికె రెడ్డి…సక్సెస్ ఫుల్ పర్సన్ కాకపోయిన అతని చిన్న కుమారుడు మాత్రం మాంచి విజయాలను అందుకుంటున్నాడు. అటు ఆన్ స్క్రీన్ .. ఇటు ఆఫ్ స్ర్రీన్ పైన. అనూహ్యంగా నడిఘర్ సంఘానికి ప్రెసిడెంట్ కావడం,రైతుల పక్షాన పోరాడటం, పైరసీ పైనే గళ మెత్తడం, జల్లికట్లుగా మద్దతుగా మాట్లాడటం, మెర్సల్ చిత్రంకు మద్దతుగా మాట్లాడటం చూస్తుంటే… ఓ లీడర్ కు కావల్సిన లక్షణాలన్ని విశాల్ కు ఉన్నట్లు స్పష్టమవుతున్నాయి.

తాజాగా ఉన్నట్లుండి ఆర్ కె నగర్ బై ఎలక్షన్స్ లో ఇండిపెంటెండ్ అభ్యర్ధిగా పోటీపడటం చూస్తుంటే… విశాల్ గట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎఐడిఎమ్ కే నుంచి ఈ.మధుసూదన్ ,డిఎమ్ కె నుంచి ఎన్ .మరుద గనేస్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.అలాగే విశాల్ కూడా నామినేషన్ దాఖలు చేశాడు. ఈ సంధర్భంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉంటే ఆర్ కే నగర్ నుంచి విశాల్ నామినేషన్ వేయడంలో ప్రధాన పార్టీలిద్దరికీ విశాల్ చుక్కలు చూపిస్తున్నాడు.నడిఘర్ సంఘం అధ్యక్షుడిగా ఇప్పటికే తన హవా చూపిస్తున్న విశాల్ … ఈనెల 21 న జరిగే ఉప ఎన్నికలలో తన సత్తా చూపించి అందరికీ మతులు పోగొట్టాలని చూస్తున్నాడు. ఒకవేళ అదే గనుక జరిగితే.. తమిళ రాజకీయ తెరపై ఓ తెలుగోడి సత్తా భయటపడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -