Wednesday, May 1, 2024
- Advertisement -

మీడియాలో మద్యం తాగేవాళ్లు లేరా?

- Advertisement -

దర్శకుడు పోసాని కృష్ణమురళి ఒక ఫైర్ బ్రాండ్ .పోసానికి మెంటల్ లేస్తే ఇక అదుపుచేయడం చాలా కష్టం. నోటికి ఎంతవస్తే అంతా అనేస్తారు. ఎదుటివారిది తప్పు అని తెలిస్తే కడిగిపారేస్తారు.నంది అవార్డుల విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ పై పోసాని తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాపై పడ్డారు. మీడియాలో మద్యం తాగేవాళ్లు లేరా? అని గట్టిగా నిలదీశారు.

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డు, తెలంగాణ అమెరికా అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ మారథాన్ 5కె రన్ లో పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణగా ఉంటే పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కారని చెప్పారు. టీవీలో డ్రగ్స్ చూపించడం వంటివి చేస్తే పిల్లల్లో మంచి లక్షణాలు రావని అన్నారు. పిల్లల్లో మంచి లక్షణాలు పెరగాలంటే ఇంట్లో పరిస్థితులు బాగుండాలని చెప్పారు.

సినీ పరిశ్రమలో మద్యం, డ్రగ్స్ రాకెట్ పై మీ స్పందన ఏంటి? అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు పోసాని. ‘ఒక్క సినీ పరిశ్రమలోనే ఏంటి? మీ మీడియాలో లేవా? మీడియాలో మద్యం తాగరా?’ అని ఎదురు ప్రశ్నించారాయన. పోసాని అలా ఎదురు ప్రశ్నించేసరికి భిత్తరపోయిన ఆ పాత్రికేయుడి నోటివెంట మాటరాలేదు. డ్రగ్స్, మద్యం వంటివి కేవలం ఒక సినీ పరిశ్రమకో లేక మీడియాకో పరిమితం కాదని, అన్ని రంగాల్లోనూ ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలని పోసాని సూచించారు.దీంతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా, యువతకు మరింత అవగాహన కలిగించి, మహమ్మారి బారి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఈ 5 కె రన్‌ ను నిర్వహించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -