Saturday, May 18, 2024
- Advertisement -

బాబుకే వెన్నుపోటు రాజకీయమా?.. బిజెపి పెద్దలతో తెదే మంత్రి భేటీ ఆంతర్యం ఏంటో?

- Advertisement -

నారా చంద్రబాబునాయుడి కేబినెట్‌లో కీలక శాఖకు మంత్రిగా ఉన్న నాయకుడు స్వయంగా బిజెపి పెద్దలతో భేటీ అవడాన్ని ఎలా చూడాలి? చంద్రబాబు పంపిస్తేనే వెళ్ళి బిజెపి పెద్దలతో మంతనాలు జరిపాడా? లేక 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తన క్రేజ్‌ని వాడుకుని …….ఆ తర్వాత 2019లో తన గెలుపు కష్టం అని తెలియగానే తన ఇమేజ్‌ని పూర్తిగా డ్యామేజ్ చేస్తూ తనను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న చంద్రబాబును గట్టి దెబ్బకొట్టడానికి ఎదురు చూస్తున్న మోడీకి చంద్రబాబు రహస్య సమాచారాన్ని ఇవ్వడానికి వెళ్ళాడా? వెన్నుపోటు రాజకీయాలతోనే ఎదిగొచ్చిన చంద్రబాబుకే వెన్నుపోటు రాజకీయాలు చూపించేంత ధైర్యం ఆ తెదేపా మంత్రి చేశాడా? ఇప్పుడు ఈ విషయాలే జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

చంద్రబాబు కేబినెట్‌లో కీలక మంత్రి. చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో నిధులు సమకూర్చిన బిజినెస్ మేన్ కం నాయకుడికి సన్నిహిత బంధువు అయిన నాయకుడు బిజెపి పెద్దలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. 2014 ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆశ చూపించి ఈ నాయకుడిని టిడిపిలో చేర్చుకున్నాడు చంద్రబాబు. ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినట్టుగానే ఈ నాయకుడిని కూడా మోసం చేశాడు చంద్రబాబు. అందుకే 2019 ఎన్నికల్లో హంగ్ రావడం ఖాయమన్న ఉద్ధేశ్యంతో ………అల జరిగితే తనకు ఉప ముఖ్యమంత్రి, తన కులం నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయం అన్న అభిప్రాయంతో బాబును ఇరికించడానికి ఈ నాయకుడు ప్రయత్నిస్తున్నాడని టిడిపి నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఈ నాయకుడిని ఏమీ చేయలేని స్థితిలో ఉండడం టిడిపి నాయకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. కట్టు తప్పుతున్న నాయకులను, పార్టీకి ద్రోహం చేస్తున్న నాయకులను శిక్షించడానికి చంద్రబాబు పూర్తిగా భయపడుతున్నాడని టిడిపి నాయకులే విమర్శలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచేంత ప్రజా బలం లేదన్న భయంతో ఎవరు ఏం చేసినా కూడా చంద్రబాబు ఏ ఒక్క నాయకుడి విషయంలో కూడా కటువుగా ఉండలేని పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునే బుక్ చేసి రాజకీయంగా ఎదగాలనుకుంటున్న ఆ టిడిపి మంత్రివర్యుల వ్యూహాలు వర్కవుట్ అవుతాయా? టిడిపి నేతలే స్వయంగా ఇస్తున్న అవినీతి, అక్రమాల సమాచారంతో చంద్రబాబు, లోకేష్‌ల విషయంలో ముందు ముందు నరేంద్ర మోడీ అమలు చేయబోయే వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -