ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చాలా బలంగా ఉంది.. టీడీపీ అట్టడుగు స్థాయికి వెళ్లిందన్న సంగతి తెలిసిందే.. అయితే అందుకు కారణం అందులోని బలమైన నాయకులూ ఇతర పార్టీ లకు వెళ్లడమే అని చెప్పొచ్చు.. నయానో భయానో టీడీపీ నేతలు అధికార పార్టీ కి , లేదా బీజేపీ పార్టీ కి వలస వెళ్తున్నారు.. దాంతో టీడీపీ మరింత క్షీణించిపోయింది.. పోనీ గెలిచినా ఎమ్మెల్యేలు అన్నా సక్కగా ఉన్నారా అంటే వారు ఇప్పుడా అప్పుడా అన్నట్లు ఉన్నారు.. ఇంకొందరు అయితే టీడీపీ లో ఉంటూనే వైసీపీ కి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు.. ఇక వైసీపీ పార్టీ టిడిపిలో ఉన్న బలమైన నేతల మీద వివిధ కేసులు పెట్టి వారిని ఒత్తిడిలోకి నెట్టి పార్టీ మార్పిస్తుందని ఆరోపించడం మనం చూస్తూనే ఉన్నాం.. కానీ అదేం లేదని వైసీపీ అంటుంది..
ఏదేమైనా టీడీపీ నేతలు వైసీపీ లోకి రావడానికి ఇష్టపడట్లేదన్నది కొంతమంది చెప్తున్నా వాదన.. ఇప్పటికే వైకాపాకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు తప్ప మిగిలి ఉన్న అందరూ కూడా వైసిపికి ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడింది అని తెలుస్తుంది. టిడిపి క్షేత్రస్థాయి నేతలు ఇప్పుడు వైసీపీకి ఎదురు తిరుగుతున్నారు అని స్పష్టంగా అర్థమవుతుoది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా వైసీపీకి అన్ని విధాలుగా కూడా వ్యతిరేకంగానే ఉన్నారు అనే విషయం చెప్పవచ్చు. తాజాగా వచ్చిన ఒక వార్త ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకి వైకాపా పార్టీ నుంచి తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, అయితే సదరు ఎమ్మెల్యే పార్టీ మారేది లేదని కుండబద్దలు కొట్టినట్లు అధికార పార్టీ నాయకులకి సమాచారం పంపినట్లు జిల్లా కేంద్రంలో ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా తన పార్టీ మారే అవకాశం లేదు అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అధికార పార్టీ ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా, తాను మాత్రం పార్టీ మారడానికి ఆసక్తిగా లేదని తెలుగుదేశం పార్టీలో తనకు భవిష్యత్తు కనిపిస్తోంది అని చెప్పటం విశేషం. అంతే కాకుండా తన వర్గం కూడా పార్టీ మారేది లేదు అని ఆయన స్పష్టంగా చెప్పారు అంట. దాదాపు తన వర్గంలోని ఒక 115 మంది నేతలను వైసీపీలోకి చేర్చుకోవడానికి స్థానిక నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నా, వారెవరూ తాము పార్టీ మారేది లేదు అని స్పష్టంగా చెప్పడంతో జిల్లాకు చెందిన ఒక కీలక నేత షాక్ కు గురయ్యారట. ఇప్పటికే సదరు ఎమ్మెల్యే వ్యాపార సంస్థల మీద అధికారుల దాడులు మొదలైన సంగతి తెలిసిందే. మరి ఇంకా ఎంతకాలం ఆయనకు ఇబ్బందులు కొనసాగుతాయి చూడాలి.