పట్టాభినే కాదు.. చంద్రబాబును కూడా అరెస్టు చేయాలి

- Advertisement -

డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏపీ సీఎం వైయస్ జగన్‌పై.. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడి చేశారు. అనంతరం రాష్ట్రంలో పరిస్థితులు రణరంగంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా గొడవలకు కారణమైన పట్టాభిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పోలీసులు పట్టాభి ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి పోలీసులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య పట్టాభిని ఇంటి దగ్గరి నుంచి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పట్టాభిపై సెక్షన్ 153ఏ, 505 (2), 505 (r/w), 120బి కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

ఇదిలా ఉండగా టీడీపీ నాయకుడు పట్టాభిని మాత్రమే కాకుంటా, ఈ మొత్తానికి కపటనాటక సూత్రధారి చంద్రబాబును కూడా అరెస్టు చేయాల్సిందిగా, విచారణ చేయాల‌ని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ కుట్ర అంతటినీ తానే కర్త, కర్మ, క్రియ అయిన చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తాయని, నమ్ముతూ తక్షణం చంద్రబాబను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను.

ఛానళ్లపై కేసు పెట్టిన సమంత…

టీడీపీకి మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా…!

ప్రభాస్ ను ఢీ కొట్టనున్న పృథ్వీరాజ్..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -