Friday, April 26, 2024
- Advertisement -

రోజా రాజీనామా.. జగన్ ఏమన్నారో తెలుసా..?

- Advertisement -

నేను ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ ఓటమి అని అంటున్నారు. ఐరెన్ లెగ్ అంటున్నారు. పార్టీ తరుపున మాట్లాడుతుంటే.. బూతులు అంటున్నారు. నంద్యాల ఓటమికి కారణం నన్నే అంటున్నారు. జగన్ పక్కన ఉంటే.. జగన్ ఎప్పటికి ముఖ్యమంత్రి అవ్వరని అంటున్నారు. నేను ఏం చేసాను అని నా మీద ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.

నన్నే ఎందుకు టార్గెట్ ఎందుకు చేసారు. ఉన్నది ఉన్నట్లు నిజం మాట్లాడితే తప్పు ఏంటి.. రాజకీయాల్లో నిజాలు మాట్లాడితే తప్పా.. అని ఎమ్మెల్యే రోజా జగన్ ఎదుట కన్నీళ్ల పర్యంతం అయ్యింది. తన మనసులోని ఉన్న మాటలు అన్ని చెప్పేసింది. అంతేకాకుండా తన బాధను తగ్గించుకోవడం కోసం కొన్ని సంచలన నిర్ణయాలను బయటకు పెట్టింది. జగన్ అన్నా మీరు అధికారంలోకి వచ్చి.. ముఖ్య మంత్రి కావాలి.. నన్ను అందరు అంటున్నట్లు.. ఐరెన్ లెగ్ అయితే.. మీరు నమ్మితే.. ఇప్పుడే నేను రాజీనామా చేస్తా అని చెప్పిందట. అంతేనా 2019 ఎన్నికల్లోనూ పోటీ చేయను అని చెప్పిందంట. పార్టికి రాజీనామా చేసి.. మీ కోసం పోరాడతా.. టీడీపీ ద్రోహం ప్రజలకు తెలియజేస్తా అని చెప్పిందట. బయటకే కాదు.. పార్టీలోనూ కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. మీరు కూడా అదే సెంటిమెంట్ ను నమ్మినట్లయితే మాత్రం నా నిర్ణయం ఇదే అని స్పష్టం చేసిందట రోజా. అప్పుడు జగన్.. అధికార పార్టీ.. అందులోనూ చంద్రబాబు.. ఆయన గోబెల్స్ ప్రచారాన్ని పట్టించుకోవద్దు.. నువ్వు రాజీనామా చేయాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా నువ్వు పోటీ చేయ్యి.. ఎవరి ఏం అన్న.. నువ్వు వైసీపీ పార్టీలోనే ఉంటావని అన్నారట.

ఓ ఆడ కూతురి విషయంలో టీడీపీ ఇంత కర్కోటంగా వ్యవహరించటం నాకు బాధగానే ఉంది.. మహిళ అంటే మహాలక్ష్మి.. నువ్వు ఆ బాధ నుంచి బయటకు రా.. రాజకీయాలు అన్నాక ఇలాంటి అన్నీ మాములే అని ఓదార్చారట. జగన్ ఓదార్పుతో.. రోజా.. ఎవరు ఏమన్నా.. జగన్ మాత్రం నమ్మారు అది చాలు అని రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ తన నోటికి పని చెప్పినుందని వైసీపీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -