టాలీవుడ్ హీరోయిన్స్ చేస్తున్న బిజినేస్ ఏంటో తెలుసా..?

- Advertisement -

సినిమా రంగంలో నాటికి నేటికీ చాలా మార్పు వచ్చింది. గతంలో.. తక్కువ మంది హీరో హీరోయిన్స్ ఉండే కాబట్టి.. లాంగ్ కెరీర్ ఉండేది. ఇప్పుడు అలా కాదు పరిస్థితులు మరాయి. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు… ఫ్లాప్ హీరోయిన్ అని ముద్ర వేసేస్తున్నారు. దీంతో హీరోయిన్స్ కి ఆఫర్లు రావడం లేదు. ఇక ఈ సంగత్తిన్ని ముందే పసిగట్టిన హీరోయిన్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దే పనిలో ఉన్నారు.

తమకు వచ్చిన రెమ్యునరేషన్స్ తో హీరోయిన్లు వివిధ వ్యాపారాలు చేస్తూ భవిష్యత్తులో.. ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే పక్క ప్లాన్ తో బిజినేస్ చేస్తున్నారు. మరి ముందు చూపుతో బిజినెస్ చేస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరో.. వారు చేస్తున్న బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికే స్టార్ హీరోస్ సరసన నటించి బానే డబ్బు వెనక వెసింది. దాంతో ఇప్పుడు ఈ భామ జ్యువెలరీ బిజినెస్ చేస్తోంది. ఇటు జ్యువెలరీ బిజినెస్‌లో రాణిస్తూ బాగానే లాభాలు మూటగట్టుకుంటోంది. ఇక ప్రణీత అయితే రెస్టారెంట్ బిజినెస్‌లో దూసుకువెళుతోందట. ఈ కన్నడ హీరోయిన్ ఆ భాషలో కన్నా తెలుగు సినీపరిశ్రమలోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. తాను వ్యాపార వేత్తగా ఎదగాలన్నదే ప్రణీతకు ఇష్టమైన పనట. అందుకే బెంగుళూరులో బూట్ లిక్కర్స్ అనే రెస్టారెంట్‌లో భాగస్వామ్యమైంది. రెస్టారెంట్‌లో బాగానే ఆదాయం వస్తోందని తన స్నేహితులతో సంతోషంగా చెబుతోందట ప్రణీత. హీరోయిన్ కృతి కర్బందా.. ఈమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో తెలుగు సినీపరిశ్రమను వదిలేసి కన్నడ సినిమాల్లో నటిస్తోంది. ఈమెకు కూడా మీల్స్ అండ్ వీల్స్ పేరుతో ఒక రెస్టారెంట్‌ ఉంది. అమలాపాల్ థింగ్ బిగ్ స్టూడియోస్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను నడుపుతోంది.

- Advertisement -

అటు సినిమాల్లోను ఇటు ప్రొడక్షన్ పనులను చేస్తూ రెండు చేతులా సంపాదించేస్తోంది అమలాపాల్. ఇక కాజల్ తన చెల్లెలు నిషాతో కలిసి జ్యువెలరీ బిజినెస్ చేస్తోంది. ఇక శ్రియ అయితే మసాజ్ బిజినెస్‌ను నడుపుతోంది. శ్రియ శ్రీ పేరుతో ముంబైలో ఒక స్పా(మసాజ్) బిజినెస్‌ను నడుపుతోంది. తాప్సి అయితే వెడ్డింగ్స్ ప్లాన్ చేస్తూ బిజినెస్‌లో చాలా బిజీగా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ బిజినెస్ చేస్తోంది. హైదరాబాద్, వైజాగ్‌లలో జిమ్‌ను నడుపుతూ బాగా సంపాదించేస్తోంది. ఇలా హీరోయిన్స్ అందరు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -