- Advertisement -

జ‌గ‌న్ ఆపని చేస్తే ఆయ‌న కాళ్లు ప‌ట్టుకుంటా..జ‌లీల్‌

- Advertisement -

బీకాం ఫిజిక్స్ ప్ర‌పంచ‌కంలో అంటూ సంచ‌ల‌నాలు అంచ‌ల‌నాలు తిర‌గ‌రాశారు ఎమ్మెల్యేజ‌లీల్ ఖాన్ పార్టీ ఫిరాయింపులు ప‌క్క‌న పెడితే దాని కంటే ఎక్కువ‌గా బీకాం ఫిజిక్స్ తో సంచ‌ల‌నాలు క్రియేట్ చేశారు. జ‌గ‌న్‌పైన విమ‌ర్శ‌లు, చాలెంజ్‌లు చేయ‌డం బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యేకు మామూలే.

తాజాగా మ‌రో సారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సవాల్ విసిరారు. జగన్.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తే.. వెంటనే తాను జగన్ కాళ్లు పట్టుకుంటానని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఈ నాలుగేళ్లలో జగన్ చేసింది ఏమిటని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. జగన్ నోటి నుంచి మోదీ ఒక దొంగ, బీజేపీ మోసం చేసింది అనే మాట వస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

పార్లమెంటును సజావుగా నడిపించలేని నరేంద్రమోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్నారు. దళితులు, మైనార్టీల మీద దాడులు చేస్తున్నా కేంద్రం చోద్యం చూస్తోందన్నారు. చంద్రబాబునాయుడు బాధ్యతగల వ్యక్తి కాబట్టి నాలుగేళ్లు ఓపిక పట్టారని, మరి ప్రతిపక్ష నేతగా జగన్ నాలుగేళ్లు ఏమి చేశాడో చెప్పాలని ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ఇన్ కంటాక్స్ కట్టనవసరం లేదు అని చెప్పే జ్ఞానం లేని జగన్ ముఖ్యమంత్రిగా పనికి వస్తాడా? అని ఆయన అన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -