Sunday, May 5, 2024
- Advertisement -

పొలిటిక‌ల్ ఎంట్రీపై జ‌గ‌ప‌తి బాబు

- Advertisement -

సీని న‌టుడు జ‌గ‌ప‌తిబాబు హీరోగా ఉన్న‌ప్పుడు మంచి ఫ్యామీలి హీరోగా గుర్తింపు తెచ్చ‌కున్నాడు.జ‌గ‌ప‌తి బాబుకి చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉండేవారు. ప్ర‌స్తుతం ఆయ‌న విల‌న్ రోల్స్‌,క్యారెక్ట‌ర్ రోల్స్ చేస్తు బిజి బిజిగా ఉన్నారు.చాలా రోజుల నుండి జ‌గ‌ప‌తి బాబుపై ఓ రూమ‌ర్ వ‌స్తుంది.అది ఏమిటంటే జ‌గ‌ప‌తి బాబు రాబోవు ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్నార‌ని, ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో అనేది ఇంకా నిర్ణ‌యించలేద‌నే వార్త‌లు చాలా రోజుల నుండి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై ఆయ‌న స్ప‌దించారు.గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. గతంలో కొందరు నేతలు తనను రాజకీయాల్లోకి ఆహ్వానించారని.. అయితే తనకు ఆ ఆలోచన లేదన్నారు. సినిమాల్లో ఎలాంటి పాత్రలొచ్చినా నటించడానికి సిద్ధమేనని.. అవసరమైతే గుండుతో నైనా నటిస్తానని జగపతిబాబు చెప్పారు.ప్రత్యేకహోదా ఉద్యమానికి సినీ పరిశ్రమ దూరంగా లేదన్నారు ప్రముఖ సినీనటుడు జగపతిబాబు. ఈ అంశంపై అవసరమొచ్చినప్పుడు స్పందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -