ఏపీలో టీటీడీ ఛైర్మెన్ పదవి ఎవరికి అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తెరపైకి కొందరి పేర్లు వచ్చినా వారిమీద ఆరోపనలు రావడంతో వాయిదా పడ్తూ వస్తోంది. ఇప్పటికె ఆ పదవికోసం టీడీపీలోని బలమై నాయకులు ఆశలు పెట్టుకున్నా వారి ఆశలు అడియాశలయ్యాయి. గతంలో టీటీడీ ఛైర్మెన్ పదవి కావాలని బాబుకు లేఖ రాసిని ఆ పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తాజాగా బాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాప్రతినిధులకు ఆ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. టిటిడి చైర్మన్ పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల కడప జిల్లా మైదుకురు నియోజకవర్గ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ పేరు వినిపించినా అది వివాదం కావడంతో దానిని పక్కన పెట్టారు. టిటిడి చైర్మన్ పదవిపై బాబు మనసులో ఏముందో ఎవరికీ తెలియడం లేదని రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి ఛైర్మన్ పదవిని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వరని రాయపాటి సాంబశివ రావు అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి పదవులివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒట్టేసుకున్నారట అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికి టీటీడీ ఛైర్మెన్ పదవిపై ఆశలు చావనట్టుంది ఎంపీకి.