Friday, March 29, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు షాక్‌…..మెనుకంజ‌లో అగ్ర‌నేత‌లు..

- Advertisement -

తెలంగాణ లో కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులూ వెనుకంజ లో ఉండటం ఇప్పుడు ఆశ్చర్యాన్ని రేపుతోంది. తెరాస మీద వ్యతిరేకత ఉందనుకున్న నాయకులే ఇప్పడూ వెనుక పడిపోవటం కాంగ్రెస్ ను కలవర పెడుతుంది. కాంగ్రెస్ సీనియర్లకు ఈ ఫలితాలు షాకులమీద షాకులిస్తున్నాయి. కచ్చితంగా గెలుస్తారనుకున్న చాలా మంది సీనియర్లు వెనకంజలో ఉంటున్నారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, జహీరాబాద్‌లో గీతారెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క, గద్వాలలో డీకే ఆరుణ వెనకంజలో ఉన్నారు.

కామారెడ్డిలో షబ్బీర్ అలీ, ఆందోల్‌లో దామోదర రాజనరసింహ, కోదాడలో ఉత్తమ్ పద్మావతి, నాగర్ కర్నూల్‌లో నాగం జనార్దన్ రెడ్డి, సాగర్‌లో జానారెడ్డి వెనకంజలో ఉన్నారు. చివరకు టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కూడా తొలి రౌండ్‌లో ఆధిక్యంలో ఉన్నా, తర్వాతి రౌండ్‌లో వెనకంజలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -