తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈనెల(ఏప్రిల్) 14వ తేదీన వైసిపి తరపున సీఎం జగన్ జగన్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం బీజేపీ, టీడీపీ ప్రచారాల్లో సీనియర్ నేతలు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ నుంచి రత్నప్రభ, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి అభ్యర్థులుగా నిల్చున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ శనివారం చేపట్టిన పాదయాత్ర, బహిరంగ సభ సక్సెస్ అయ్యంది.
పవన్ పాదయాత్ర, సభకు భారీ ఎత్తున జనం తరలిరావడంతో బీజేపీ-జనసేన కూటమిలో ఉత్సాహం నింపింది. మరోపక్క టీడీపీ నుంచి నారా లోకేష్ బహిరంగ సభ, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాటుకు రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మైదానాన్ని టీటీడీ వై.వి.సుబ్బారెడ్డి, పంచాయతీ రాజ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు.
తిరుపతిలో ప్రచార పర్యటనకు రూట్ మ్యాప్ ను సిద్దం చేసేందుకు పలు ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 20 నెలల వ్యవధిలో మొదటిసారిగా తిరుపతి ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రచారానికి రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఎలాంటి ప్రచారం చేయకుండానే సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చిన నేపథ్యంలో ఇక సీఎం స్వయంగా రంగంలోకి దిగితే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రతిపక్షాలకు తెలుస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు.
BREAKING NEWS: ఎన్నికలకు పచ్చజెండా ఊపిన కోర్టు!