కరోనా పై సమీక్ష.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..!

- Advertisement -

కరోనా రెండో దశ తెలంగాణను చుట్టుముట్టేస్తోంది. మొదటి దశ కన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో 2 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11,617 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.ప్రస్తుతం 11 వేలు కరోనా క్రియాశీలక కేసులు దాటాయి. 6,634 మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారు.

ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్నా.. చాలా వరకు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇక రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చడంతో…. ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మహమ్మారి కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నా… ప్రజల నిర్లక్ష్యంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

- Advertisement -

ఇప్పటికే అధికారులతో సమీక్షించిన మంత్రి ఈటల రాజేందర్‌… కరోనా కట్టడిపై మధ్యాహ్నం రెండు గంటలకు… కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ భేటీకి పలువురు వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటల అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

సైకిల్ మీద మంత్రి.. పరుగులు తీసిన జనాలు..!

దారుణంగా తెలంగాణ పరిస్థితి.. ఏకంగా 2 వేలు..!

అమర జవాన్ కి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు చెక్కు విడుదల!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -