Friday, May 17, 2024
- Advertisement -

‘నాయుడంటేనే నాయకుడు’ అన్న వెంకయ్యకు రామోజీరావు బూతులు కనిపించవా?

- Advertisement -

‘నాయుడంటేనే నాయకుడు’…… ఈ డైలాగ్ చెప్పింది మన ఉప రాష్ట్రపతి…. శ్రీ మాన్ అంటూ టిడిపి భజన మీడియా ఓస్థాయిలో ప్రశంశలు కురిపిస్తూ ఉండే శ్రీ వెంకయ్యనాయుడుగారే. నాయుడులు అంటే వెంకయ్యకు ఎంత ఇదో ఈ డైలాగ్‌లోనే కనిపిస్తోంది. ఇక ఈ కోవలోని మీడియా పెద్దలందరూ కూడా వెంకయ్యను ఓ స్థాయిలో మోసేస్తూ ఉంటారు. కాకపోతే 2014కు ముందు హోదా పేరు చెప్పి సీమాంధ్రుల ఓట్లు కొల్లగొట్టడం……..అధికారంలోకి వచ్చాక ఇంకో నాయుడు చంద్రబాబు నాయుడితో కలిసి అదే ప్రజలకు హోదా వేస్ట్, అవసరం లేదు అంటూ జెల్లకొట్టడం లాంటి విషయాలను మాత్రం కాస్త నిజాయితీగా ఆలోచించేవాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే ఎన్నికల ముందు మాత్రం రైతు రుణాలన్నీ చంద్రబాబు మాఫీ చేస్తానని చెప్తే వెంకయ్య మద్దతు ఇస్తాడు. ఎన్నికలయిన వెంటనే రైతు రుణాలు మాఫీ చెయ్యడం అంటే దేశానికి ద్రోహం చెయ్యడమే అనే స్థాయిలో మాట్లాడతాడు. ఈ విషయాన్ని కూడా కొంతమంది ఎత్తి చూపి దెప్పిపొడుస్తూ ఉంటారు. అయితే వెంకయ్యనాయుడు మాత్రం ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోడు. కేవలం తన భజన చేసేవాళ్ళను, తనవాళ్ళను మాత్రం దగ్గరకు తీస్తూ ఉంటాడు.

భజనకు ప్రతిగా తన వాళ్ళు అనుకున్నవాళ్ళ భజన కూడా చేస్తూ ఉంటాడు. తాజాగా కూడా వెంకయ్యనాయుడు ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. వెంకయ్యకు ఈ మధ్య పెద్ద కార్యక్రమమా? చిన్న కార్యక్రమమా? అన్న పట్టింపులు ఉండడం లేదు. కాబట్టి మనకు కూడా ఆ కార్యక్రమం గురించి అనవసరం. కానీ ఆ కార్యక్రమంలో తన ప్రసంగం సందర్భంగా కొన్ని అమూల్య వాక్యాలు చెప్పాడు వెంకయ్య. రామోజీరావు నిర్మాణంలో విలువలు, ధర్మాలు, గొప్ప సిద్ధాంతాలు వెంకయ్యగారికి ఏవో కనిపించాయట. తెగ పొగిడేశాడు. కాకపోతే ఉప రాష్ట్రపతి స్థాయిలో ఉన్న వ్యక్తి రామోజీరావులోని ఒక పార్శ్వం గురించి మాట్లాడడంపైనే విశ్లేషకులు ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు టివీ తెరను బూతు మయం చేస్తున్న జబర్ధస్త్ రామోజీవారిదని వెంకయ్యకు తెలియదా? ఇక పోరా…. పోవే… అని….. ఇంకా తిట్టించుకోవడం, బూతుల వర్షం కురిపించుకోవడమే పనిగా వస్తున్న అనేక బూతు కార్యక్రమాలకు ఆద్యుడిగా అదే రామోజీరావు నిలుస్తున్నాడన్న విషయం తెలియదా. అదేంటో మరి మన అనుకుంటే అంతా కూడా వాళ్ళలో ఉన్న మంచే కనిపిస్తుందేమో. కానీ రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు మన అని అనుకోవడం తప్పేమో కదా? మంచి చెడూ రెండూ చూసేలా ఉండాలేమో కదా?

ఏమో మరి….ఉషోదయం నుంచీ పొద్దస్తమానం నీతులు చెప్పడానికే ఉన్నాం అని చెప్పుకునేవాళ్ళే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -