Saturday, May 18, 2024
- Advertisement -

త‌మ్ముడిని చంపేయ‌డంపై స్టార్ న‌టుడు ఆవేద‌న‌

- Advertisement -

దొంగ‌త‌నం చేశాడ‌ని మ‌తిస్థిమితం లేని మ‌ధు అనే యువ‌కుడిని చెట్టుకు క‌ట్టేసి తీవ్రంగా దాడి చేసి ఘ‌ట‌న ఎవ‌రూ ఊహించ‌న‌ది. పైశాచికానికి ప‌రాకాష్ట జ‌ర‌గ‌డం అంద‌ర్నీ క‌ల‌చివేసింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై మ‌ల‌యాళ న‌టుడు ముమ్ముట్టి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న త‌మ్ముడిని చంపేశారు అని భావోద్వేగానికి గుర‌య్యారు.

అతడికి మతి స్థమితం లేదని అంతమాత్రాన అలా చేయడం ఏమిటని మమ్ముట్టి ప్ర‌శ్నించారు. అతడు ఆదివాసి కాదని తన సోదరుడు లాంటి వాడని చెప్పారు. ఆ దుండగులు తన సోదరుడిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో ఆలోచిస్తే మధు నిందితులకు కూడా సోదరుడిగా కుమారుడిగా కనిపిస్తాడని సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్ పెట్టారు. మధు కూడా మనలాగే భారతీయ పౌరుడు అని అతడికి కూడా మనతోపాటే హక్కులు ఉంటాయనే విష‌యం గుర్తుచేశారు.

మతి స్థిమితం లేక ఆకలిని తీర్చుకోవడానికి దొంగతనం చేసేవారిని దొంగ అని ముద్ర వేయొద్ద‌ని సూచించారు. అటువంటి వారిని ఆ పేదరికాన్ని సమాజమే సృష్టించిందని భావోద్వేగంతో పోస్ట్ చేశారు. పరిస్థితులు ఏమైనా.. కారణం ఏదైనా ఓ మనిషి మరో మనిషిపై దాడి చేయడం క్షమార్హం కాదని ఖండిస్తూ ఆవేద‌నకు గుర‌య్యారు. చివరగా ‘సారీ మధు` అని మమ్ముట్టి పోస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -