Friday, May 3, 2024
- Advertisement -

కవిత అరెస్ట్‌..వేణుస్వామి చెప్పిందే నిజమైందా?

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్‌గా మారగా ఇందుకు సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కేసులో కవిత బయటప డటం కష్టమని, ఆమె తప్పకుండా జైలుకు వెళ్తుందని గతంలో వేణుస్వామి చెప్పారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వేణుస్వామి చెప్పిందే నిజమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటారు వేణుస్వామి. ముఖ్యంగా హీరోయిన్లతో హోమాలు చేయిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఇక సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ వేణుస్వామి చెప్పే జాతకం కొన్ని సందర్భాల్లో నిజం కావడంతో ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో వేణుస్వామిపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -