Saturday, April 27, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ..షర్మిల అక్కడి నుండే!

- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కింది. ఇప్పటికే వైసీపీ పూర్తి అభ్యర్థుల జాబితాతో ప్రజల ముందుకు రాగా టీడీపీ-జనసేన సైతం మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చేసింది. ఈ నెల 25 కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదలకు రంగం సిద్ధమైంది.

వామపక్షాలతో పొత్తుతో ముందుకుసాగుతామని షర్మిల ప్రకటించిన నేపథ్యంలో ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది అన్నదానిపై అదేరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పీసీసీ చీఫ్ షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై చర్చజరుగుతోంది.

కేవలం ఎంపీగానే పోటీ చేస్తారా లేదా ఎంపీ,ఎమ్మెల్యే రెండు స్థానాలకు పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఎంపీగా పోటీ చేస్తే కడప నుండి బరిలో ఉండటం దాదాపు ఖాయమైందనే చెప్పాలి. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ అవినాష్ రెడ్డి పేరు ఇప్పటికే ఖరారు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.

ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై జోష్ నింపగా కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు ప్రకారం ఖాతా తెరుస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు వెల్లడైన సర్వేలన్ని కాంగ్రెస్ నోటాతోని పోటీ పడాల్సిందేనిన వెల్లడించడంతో షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -