Monday, June 17, 2024
- Advertisement -

ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఏం చెబుతారో….

- Advertisement -

రాష్ట్ర విభ‌జ‌న‌ను, నరేంద్ర‌మోదీ చ‌రిష్మాను ఉప‌యోగించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. త‌న సొంత బ‌లం అంతంతే ఉండ‌గా న‌రేంద్ర‌మోదీ, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇమేజ్‌ను అడ్డం పెట్టుకొని రాష్ట్ర విజ‌భ‌న‌ను ఉప‌యోగించి చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల్లో బాగా ల‌బ్ధి పొందారు. మోదీ, ప‌వ‌న్ లేకుంటే చంద్ర‌బాబుకు ప‌రాజ‌యం త‌ప్పేది కాదు. ఆ విధంగా గ‌ట్టెక్కిన బాబు నాలుగేళ్ల పాల‌న‌లో ఏమాత్రం చెప్పుకోద‌గ్గ ప‌ని రాష్ట్రంలో చేప‌ట్ట‌లేదు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌స్తుతం మూడు కీల‌క అంశాలు ఉన్నాయి. అవిః 1. రాజ‌ధాని నిర్మాణం.. 2. పోల‌వరం ప్రాజెక్టు పూర్తి. 3. ప్ర‌త్యేక హోదా

ప్ర‌త్యేక హోదాను ఎలాగో గాలికొదిలేసి ప్ర‌త్యేక ప్యాకేజీ అని ప‌ట్టుకొచ్చారు. అది వ‌దిలేస్తే మిగ‌తా రెండు అంశాలు వాటి పేరు ఎత్త‌క‌పోతే మంచిది. పోల‌వ‌రం నిర్మాణం, రాజ‌ధాని నిర్మాణం పునాదుల ద‌శ‌ల్లోనే ఉండిపోయింది.

రాజ‌ధాని నిర్మాణం మొద‌టి నుంచి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. రాజ‌ధాని నిర్మాణానికి శంకుస్థాప‌న అట్ట‌హాసంగా చేసేసి త‌ర్వాత ప‌ట్టించుకోలేదు. ప్ర‌స్తుతం కేవ‌లం తాత్కాలిక నిర్మాణాల‌పైనే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు. అవి కూడా నాసిర‌కంగా నిర్మించ‌డంతో చిన్న వ‌ర్షానికే దెబ్బ‌తింటుడ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో వీటిపై చంద్ర‌బాబు నాయుడు ఏమీ మాట్లాడతారో ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే 2018లోపు పోల‌వ‌రం నీళ్లు పొలాల‌కు అందిస్తాన‌ని 2014 ఎన్నిక‌ల్లో ఆ త‌ర్వాత కూడా ప‌లు స‌భ‌ల్లో ప్ర‌క‌టించారు. 2018 వ‌చ్చినా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు చూస్తుంటే 2019 సంవ‌త్స‌రం పూర్త‌య్యేలోపు కూడా నీళ్లు అందే అవ‌కాశం లేదు. ఇక రాజ‌ధాని నిర్మాణం రోజుకో దేశంలాగా నిర్మాస్తామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు చివ‌రికి ఓ కుగ్రామంగా రాజ‌ధాని శంకుస్థాప‌న ప్రాంతం త‌యారు చేశారు.

ఇప్పుడు ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యే స‌మ‌యంలో ఈ రెండింటిపై ఎవరినీ నిందితుడిగా చేస్తారో.. ఏవిధంగా క‌ప్పి పుచ్చుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -