Monday, June 17, 2024
- Advertisement -

అచ్చెన్నాయుడు…ఎక్కడా?

- Advertisement -

ఏపీ ఎన్నికల తర్వాత పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింస నేపథ్యంలో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు, టీడీపీ నేతలతో కుమ్మక్కై అల్లర్లను ప్రోత్సహించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ పరిణామ క్రమాలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం స్పందించడం లేదు. టీడీపీలో కీలక నేతగా పేరు తెచ్చుకున్న అచ్చెన్న..బాబు అరెస్ట్ తర్వాత అంతా తానై వ్యవహరించారు. కానీ తాజా ఎన్నికల తర్వాత పూర్తి సైలెంట్ అయ్యారు. ఓ వైపు వైసీపీ గతంలో గెలిచిన స్థానాల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఓటమి భయంతో అచ్చెన్న బయటకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పుడు టీడీపీ నేతల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఇక ఏపీ టీడీపీ చీఫ్‌గా లోకేష్‌ని నియమించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్ చేయడం అచ్చెన్న సైలెంట్ వెనకున్న కారణం కావొచ్చు అని టీడీపీ నేతలే చెబుతున్నారు. మరి టీడీపీలో జరుగుతున్న ఈ ఊహాగానాలకు అచ్చెన్నాయుడు స్పందిస్తే తప్ప చెక్ పడేలా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -