Monday, May 5, 2025
- Advertisement -

బాబు, పవన్, లోకేశ్.. మీలో ఎవరు సి‌ఎం ?

- Advertisement -

ఏపీలో రోజురోజుకూ పోలిటికల్ హిట్ మరింత పెరుగుతోంది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి మూడు ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటి నుంచే ఎలక్షన్ మూడ్ లో కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని టీడీపీ, జనసేన పార్టీలు బలంగా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. సరైన వ్యూహాలను సిద్దం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అధినేతలు. అయితే గత కొన్ని రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా నిలుస్తోన్న చర్చ.. టీడీపీ జనసేన పొత్తు అంశం. .

ఈ రెండు పార్టీల పొత్తు పై అటు పవన్ ఇటు చంద్రబాబు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికి వైసీపీ మాత్రం ఈ రెండు పార్టీల పొత్తును పదే పదే ప్రస్తావిస్తోంది. ఇక ఇటీవల పొత్తులకు తాము సిద్దమే అని పవన్ స్పష్టం చేయడంతో దీనినే ప్రధాన విమర్శనస్త్రంగా వాడుకుంటోంది వైసీపీ. ఇదిలా ఉంచితే తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతున్నాయి. పవన్ ఎవరికోసం పని చేస్తున్నారో స్పష్టం చేయాలని, చంద్రబాబు పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేసిన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు, లోకేశ్, పవన్ లలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకొని బరిలోకి దిగాలని సూచించారు.

దీంతో పవన్, లోకేశ్, చంద్రబాబు లలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. కాగా పొత్తులకు సై అని ఇప్పటికే స్పష్టం చేసిన పవన్.. ఒకవేళ చంద్రబాబుతో కలిస్తే.. ఇద్దరు కూడా సి‌ఎం పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తుండడంతో వీరిద్దరిలో సి‌ఎం అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇవే తనకు చివరి ఎన్నికలని చేప్తోన్న చంద్రబాబు.. సి‌ఎంగా తనను తప్పా వేరే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఇక మరోవైపు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెల్తోన్న పవన్ ఈసారి సి‌ఎం పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందువల్ల పవన్ కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదనేది రాజకీయ వాదుల నుంచి వినిపిస్తున్న మాట. ఇక మరోవైపు ఈసారి టీడీపీ గెలిస్తే చంద్రబాబు లోకేశ్ ను సి‌ఎం చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సజ్జల చేసిన వ్యాఖ్యల దృష్టా వీరి ముగ్గురిలో సి‌ఎం అభ్యర్థి ఎవరనేది సామాన్యుల్లో కూడా చర్చకు దారి తీస్తోంది.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్.. సిద్దమైన బీజేపీ ?

తెలంగాణపై జనసేన గురి.. !

చిక్కుల్లో బీజేపీ.. జనసేన ప్రభావమే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -