Sunday, April 28, 2024
- Advertisement -

చిక్కుల్లో బీజేపీ.. జనసేన ప్రభావమే

- Advertisement -

ఏపీలో బీజేపీకి సొంత పార్టీ నేతలతో ముప్పు పొంచి ఉందా ? నేతలు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారా ? మిత్రపక్షం జనసేన ప్రభావం కమలం పార్టీ పై పడుతోందా ? ఇంతకీ ఏపీలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏంటి ? ఇలాంటి ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే కమలం పార్టీకి ఆశించిన స్థాయిలో ప్రజాధరణ మాత్రం కరువైంది. దాంతో ఎలాగైనా బలం పెంచుకునేందుకు జనసేనతో చేతులు కలిపింది బీజేపీ. ఇక మొదటి నుంచి కూడా జనసేన పార్టీ బీజేపీ మిత్రపక్షంగానే కొనసాగుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం జనసేన వైఖరి బీజేపీని చిక్కుల్లోకి నేడుతోంది. .

వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి పోటీ చేస్తామని కమలనాథులు తరచూ చెబుతున్నప్పటికి జనసేన మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు. ఇదిలా ఉంచితే జనసేన ఈ మద్య బీజేపీ కంటే టీడీపీకి అధిక ప్రదాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన బీజేపీతో తెగతెంపులు చేసుకొని టీడీపీ పొత్తుకోరుతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది. అసలే బలహీనంగా ఉన్న కమలం పార్టీకి జనసేన దూరమైతే ఆ ప్రభావం పార్టీ పై గట్టిగానే పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా బీజేపీని గట్టిగానే దెబ్బతిస్తున్నాయి.

మాజీ అద్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. ప్రస్తుత అద్యక్షుడు సోము వీర్రాజు మద్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మద్య నెలకొన్న రగడ కారణంగా కొంతమంది కమలనాథులు పార్టీ వీడే ఆలోచనలో కూడా ఉన్నారట. ముఖ్యంగా కన్నా లక్ష్మినారాయణ పార్టీ వీడబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా భీమవరంలో నిర్వహించబోయే బీజేపీ కార్యవర్గ సమావేశాలకు కన్నా లక్ష్మినారాయణ హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ విడతారనే వార్తలు మరింత ఊపందుకున్నాయి. ప్రస్తుతం జనసేన పార్టీ రోజురోజుకూ బలపడుతుండడంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఇక ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నాట్లు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. మొత్తానికి మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ వల్లనే బీజేపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పవచ్చు. మరి ఏపీలో బలపడేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ తదుపరి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు కదులుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

బాలయ్య షో లో పవన్ క్లారిటీ.. ఇస్తారా ?

లోకేశ్ “యువగళం” .. పార్టీ దశ మారుస్తుందా ?

ఎన్నికల బరిలో జూ.ఎన్టీఆర్.. చంద్రబాబు వ్యూహం అదే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -