Thursday, March 28, 2024
- Advertisement -

ఆ విషయంలో కెసీఆర్, జగన్, చిరు, పవన్‌లకంటే బాబు చేతకానివాడా?

- Advertisement -

చంద్రబాబు చింతాకంత విజయం సాధించినా కైలాసాన్ని జయించుకొచ్చాడు అని చెప్పి ఆయన భజన మీడియా అంతా చెవుల తుప్పు వదిలేలా ఊదరగొడుతుంది. కానీ చంద్రబాబు వైఫల్యాలను, చేతకానితనాన్ని మాత్రం దాచిపెడుతూ ఉంటుంది. ఎన్టీఆర్ కాలంలో కూడా చంద్రబాబుది చేతకానితనమే. వెన్నుపోటు రాజకీయమే. అయితే ఆనాడు నిజాలను వెలికితీసే సోషల్ మీడియా లేకపోవడంతో చంద్రబాబు అబద్ధపు ప్రభ ఓ స్థాయిలో వెలిగిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమాని చంద్రబాబు గొప్పల డప్పాలన్నీ తుస్సుమని గాలిపోయే బుడగల్లా తయారయ్యాయి.

తాజాగా తనకంటే గొప్పనాయకుడు మరొకరు లేరు అనే రేంజ్‌లో తన డప్పు తాను కొట్టుకున్న చంద్రబాబు గాలి మరోసారి తీసేశారు నెటిజనులు. చంద్రబాబు కంటే వైఎస్ జగన్ చాలా గొప్పవాడని తేల్చేస్తున్నారు. వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టి ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ఎదుర్కున్న మొదటి ఎన్నికల్లోనే ప్రతిపక్ష నేతగా ఎదిగాడని నెటిజనులు చెప్తున్నారు. ఇక ఈ విషయంలో చంద్రబాబుకంటే చిరంజీవి కూడా బెటరే అన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఆయన కూడా తన సొంత పార్టీ స్థాపించి తన స్థాయి మేరకు ఫైట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ విషయం చెప్పనే అవసరం లేదు. కెసీఆర్ కూడా సొంతంగా పార్టీ స్థాపించి……..పోరాటం చేసి ప్రజల మెప్పు పొంది అధికారం దక్కించుకున్ననాయకుడే.

మరి అందరికంటే నేనే సీనియర్, నేనే గ్రేట్ అని అస్తమానూ లేని గొప్పలన్నీ చెప్పుకునే చంద్రబాబు సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నికలను ఎదుర్కోగలరా? కనీసం పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కునేంత ధైర్యం కూడా లేని చంద్రబాబు నుంచి ఆ స్థాయి హీరోయిజం ఆశించగలమా? ఎన్నికలొస్తున్నాయంటేనే ఎవరితో పొత్తు పెట్టుకుందాం? ఎవరి పంచన చేరి లాభపడదాం అనే నైజం చంద్రబాబుది అయితే ధైర్యంగా……….ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కుందాం, మేనేజ్‌‌మెంట్ రాజకీయాలతో కాదు…………….నిజాయితీగా ప్రజల మెప్పు పొందుదాం……….అలా దక్కితేనే ఆ అధికారానికి సార్థకత అనేది జగన్ నైజం. అదే చంద్రబాబు మాత్రం వెన్నుపోటో, పొత్తులో, అబద్ధపు హామీలో……….ఏదో ఒకటి చేసి అధికారం దక్కించుకున్నామా? లేదా అన్నదే ముఖ్యం అని విలువలకు పాతరేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో చంద్రబాబు చేతకాని తనం గురించి జగన్ పోరాడే తత్వం గురించి ఓ స్థాయిలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు నెటిజనులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -