Saturday, May 18, 2024
- Advertisement -

ఇండియాలోనే వరస్ట్ సిఎం…… రేసులో దూసుకెళ్తున్న చంద్రబాబు…. గెలుపు ఖాయం

- Advertisement -

2014 ఎన్నికల సమయంలో సీమాంధ్ర ఓటర్లకు చంద్రబాబు అనుభవమే నచ్చిందో….లేకపోతే రాష్ట్ర విభజన పర్వం ఇంకా పూర్తికాకముందే రాజధాని నిర్మాణానాకి ఎన్ని లక్షల కోట్లు కావాలో డిమాండ్ చేసిన బాబు లెక్కలు నచ్చాయో…….లేకపోతే ప్రత్యేక హోదాను ఐదేళ్ళు కాదు…..పదిహేనేళ్ళు వచ్చాలే చేస్తా అన్న బాబు భరోసా నచ్చిందో….లేక రుణమాఫీలతో సహా బాబు ఇచ్చిన హామీలు నచ్చాయో తెలియదుకానీ బాబుకు పట్టం కట్టారు. ఇక మోడీ క్రేజ్‌ని, పవన్ కళ్యాణ్ కాపు కార్డుని కూడా బాగానే వాడుకున్నాడు చంద్రబాబు. ఏం చేసైనా అధికారంలోకి రావడమే చంద్రబాబు సిద్ధాంతం. ఆ విషయం ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన సందర్భంలోనే అందరికీ అర్థమైంది. కాకపోతే చంద్రబాబు మారిన మనిషి అని నమ్మించడానికి ఆయన భజన మీడియాను, పవన్ కళ్యాణ్ లాంటి ప్యాకేజ్ స్టార్స్‌ని ఎప్పుడు? ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు.

ఏమైతేనేం……మొత్తానికి అనుకున్నది సాధించాడు. అధికారంలోకి వచ్చాక అందరినీ ముంచాడు. తాను ఇచ్చిన హామీలతో పాటు కేంద్రం నుంచి తెస్తానన్న హామీల విషయంలో కూడా హ్యాండ్సప్ అన్నాడు. ఇక కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కయ్యాడు అని 2014ఎన్నికల్లో ప్రచారం చేసిన బాబు…..ఓటుకు కోట్లు కేసు తర్వాత నుంచీ అదే కేసీఆర్‌కి ఆత్మబంధువు అయిపోయి పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిని సీమాంధ్రులకు కాకుండా చేయడంతో పాటు విభజనలో భాగంగా తెలంగాణా నుంచి రావాల్సిన అన్నింటికీ మంగళం పాడేశాడు. ఆ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కిన ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించాడు. అందుకనో ఏమో తెలియదు కానీ ఎన్డీయే పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ‘వరస్ట్ ముఖ్యమంత్రి ఎవరు?’ అన్న ఒక సర్వేలో ముఖ్యమంత్రి అగ్రపథాన దూసుకెళ్తున్నాడు.

నిన్నటి వరకూ నంబర్ ఒన్‌గా ఉన్నాడు. గెలుపు బాటలో దూసుకెళ్ళాడు. అయితే నంబర్ ఒన్ వరస్ట్ ముఖ్యమంత్రి బిరుదు ఎక్కడ గెలుస్తాడో అన్న భయంతో పచ్చ బ్యాచ్ మొత్తం రంగంలోకి దిగారు. తెరవెనుక ఏం జరిగితేనేం మొత్తానికి చంద్రబాబుని వరస్ట్ ముఖ్యమంత్రి రేసులో రెండో స్థానానికి తీసుకొచ్చారు. అయినా భయపడాల్సిందేమీ లేదు. వరస్ట్ ముఖ్యమంత్రి రేసులో చంద్రబాబు మామూలుగా దూసుకెళ్ళడం లేదు. కచ్చితంగా నంబర్ ఒన్ వరస్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబే నిలుస్తాడని విశ్లేషణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అయినా ఈ స్థాయిలో తాను ఇచ్చిన హామీలతో పాటు, కేంద్రం నుంచి రావాల్సిన హామీలు, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి తెలంగాణా రాష్ట్రం నుంచి రావాల్సినవాటిని అన్నింటికీ మంగళం పాడేసి తాను ఎన్నుకున్న ప్రజలను నిండా ముంచిన ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? అలాంటప్పుడు నంబర్ ఒన్ వరస్ట్ ముఖ్యమంత్రి రేసులో ఇంకెవరైనా ఎలా గెలవగలరు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -