Sunday, May 11, 2025
- Advertisement -

అల్లర్ల వెనకుంది..టీడీపీనే!

- Advertisement -

ఏపీ ఎన్నికల పోలింగ్, ఆ తర్వాత జరిగిన అల్లర్ల వెనకుంది టీడీపీనే అని ఆరోపించారు వైసీపీ నేతలు. డీజీపీ కార్యాలయంలో సిట్ బృందాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని ఆని,జోగి రమేష్.. చంద్రబాబు, పురంధేశ్వరిల విజ్ఞప్తితోనే ఎన్నికల సంఘం పోలీసు అధికారులను, కలెక్టర్లను మార్చిందని ఆరోపించారు.

తాడిపత్రిలో పోలీసులే సిసి కెమెరాలను పగలగొట్టారని….పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీడీపీ పన్నిన పన్నాగంలో పోలీసులు భాగస్వాములు అయ్యారని…. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారుల కాల్ డేటా సేకరిస్తే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అర్థం అవుతుందన్నారు.

మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి జగన్ ను ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసం సృష్టించారో, వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారో అంతా చూశారన్నారు. ఏ జిల్లాల్లో అయితే ఎస్పీలు, కలెక్టర్లను మార్చారో అదే చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని తేల్చి చెప్పారు వైసీపీ నేతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -