Friday, March 29, 2024
- Advertisement -

‘మీ భవిష్యత్తు – నా బాధ్యత’ అన్న బాబు స్లోగన్‌కి అదిరిపోయే కౌంటర్

- Advertisement -

2014 ఎన్నికల్లో ఆయన రావాలిలాగే ఈ సారి కూడా ‘మీ భవిష్యత్తు-నా బాధ్యత’ అనే స్లోగన్‌తో ప్రచారానికి దిగారు బాబు అండ్ కో. అయితే గురి చూసి దెబ్బకొట్టినట్టుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మొదటి సభలోనే బాబుకు దిమ్మతిరిగే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చాడు జగన్. మీ భవిష్యత్తు-నా బాధ్యత అనే స్లోగన్‌కి ఓట్లు రావడం దేవుడెరుగు………. జగన్ ఇచ్చిన కౌంటర్ దెబ్బకు ఇప్పటికిప్పుడు స్లోగన్ మార్చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి పచ్చ బ్యాచ్‌ని డిఫెన్స్‌లో పడేశాడు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులు, హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం ఉన్న సీమాంధ్ర విద్యార్థులను భవిష్యత్‌ని గాలికొదిలేసి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసినప్పుడు ఆ బాధ్యత ఏమైంది చంద్రబాబు? ఒక దళిత ప్రభుత్వ అధికారిని……..అది కూడా మహిళా అధికారిని టిడిపి ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఈడ్చినప్పుడు ఆ బాధ్యత ఏమైంది బాబూ? హెరిటేజ్ కోసం రైతుల పొట్టకొట్టినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? పుష్కరాల్లో ముఫ్పైమంది చావుకు కారణమై ఏం బాధ్యత తీసుకున్నారు? ప్రత్యేక హోదాతో సహా ఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సీమాంధ్ర ప్రజల బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారో చెప్పాలని జగన్ సూటిగా నిలదీయడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. తనను అధికారంలోకి తీసుకొస్తుందని చంద్రబాబు ఏ స్లోగన్‌ని అయితే నమ్మాడో ఆ స్లోగన్‌పైనే మొదటి సభలోనే పచ్చ బ్యాచ్‌కి దిమ్మతిరిగే స్థాయిలో జగన్ కౌంటర్స్ వేయడంతో ఇప్పుడు ఏకంగా స్లోగన్ మార్చేయాల్సిన పరిస్థితిలో టిడిపి నాయకులు డిఫెన్స్‌లో పడ్డారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ రోజు జరిగిన జగన్ సభ సూపర్ హిట్ అయింది. అలాగే అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, విద్యార్హతలు లాంటివి పరిగణనలోకి తీసుకుని……….. డబ్బుకంటే కూడా సామాజిక న్యాయానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చిన జగన్‌పైన అన్ని వర్గాల ప్రజా సంఘాల నుంచి ప్రశంశలు కురుస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -