- Advertisement -

గోవా ముఖ్యమంత్రి పారికర్ కన్నుమూత…క‌డ‌సారి చూసెందుకు త‌ర‌లివ‌స్తున్న నేత‌లు

- Advertisement -

గోవా సీఎమ్ మ‌నోహ‌ర్ పారిక‌ర్ (63) క‌న్నుమూశారు. ఏడాది కాలంగా క్లోమ గ్రంధి క్యాన్సర్ తో బాధ‌ప‌డుఉతున్న ఆయ‌న‌ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. పారికర్ భార్య 2001లోనే మరణిం చారు. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేండ్లపాటు రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పారికర్ ఏడాది కాలంగా క్లోమగ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. క్లోమగ్రంథి క్యాన్సర్‌కు అమెరికాలో టీట్‌మెంట్ కూడూ తీసుకున్నారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కొడుకులు.

ఉదయం 10 గంటల నుంచి పనాజీలోని బీజేపీ కార్యాలయంలో పారికర్ మృతదేహానికి నివాళి అర్పిస్తున్నారు. త‌మ నేత‌ల‌ను క‌డ‌సారి చూసేందుకు నాయ‌కులు, అభిమానులు త‌ర‌లి వ‌స్తున్నారు. పార్థివ దేహాన్ని కళా అకాడమీకి తీసుకుని వెళతారు. సాయంత్రం 4 గంటల వరకు సాధారణ ప్రజల సందర్శనార్థం పారికర్ పార్థివదేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో మనోహర్ పారికర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ మృతికి సంతాపంగా ఇవాళ జాతీయ సంతాపదినాన్ని కేంద్రం పాటిస్తోంది. అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ జెండాను సగం వరకు అవనతం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -