Wednesday, May 15, 2024
- Advertisement -

ఎపికోసం పోరాటం: గుంటనక్క వేషాలు ఎవరివి? నిజాయితీ ఎవరిది?

- Advertisement -

వైకాపావి గుంటనక్క వేషాలు అని చంద్రబాబు అన్నాడు. కాకపోతే ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఎవరివి గుంటనక్క వేషాలో? నిజాయితీ ఎవరిదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయేలా చేశాడు చంద్రబాబు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్….. ఇప్పుడు కూడా నిజాయితీగా రాజీనామాలకు రెడీ అయిపోయాడు. ఇక ఢిల్లీలో ధర్నా, ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలతో సహా హోదా కోసం తన పోరాట కార్యాచరణను స్పష్టంగా ప్రకటించాడు.

మరి చంద్రబాబు ఏం చేశాడు? 2014ఎన్నికల ముందు హోదా బ్రహ్మాండం అన్నాడు. అధికారంలోకి వచ్చాక హోదా వేస్ట్ అన్నాడు. ప్యాకేజ్ బెస్ట్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 2019ఎన్నికల్లో హోదా అంశమే గెలుపును డిసైడ్ చేయబోతోంది అన్న విషయం అర్థమై……హోదాలో ఉన్న ప్రయోజనాలు ఇస్తామంటేనే ప్యాకేజ్‌కి ఒప్పుకున్నాం. హోదాను వదిలేయలేదు. హోదా కోసం మేం కూడా పోరాటం చేస్తాం అని టిడిపి ఎంపిల చేత సన్నాయి నొక్కులు నొక్కిస్తున్నాడు. రేపో మాపో చంద్రబాబు కూడా హోదా కోసం మేం కూడా పోరాడతాం అని చెప్తాడనడంలో సందేహం లేదు. అలా అని హోదా కోసం చిత్తశుద్ధితో రాజీనామాలు చేయించగలడా? ఆ ఛాన్సేలేదు. రాజీనామాలు చేస్తాం అని జగన్ చెప్పిన మాటలకు క్రెడిట్ రాకుండా చేయడం కోసం …….. బాబు కూడా రాజీనామా యోచనలో ఉన్నాడు, జగన్ కంటే ముందే టిడిపి ఎంపిల చేత రాజీనామా చేయించాలనుకున్నాడు, బాబు రాజీనామాల ఉద్ధేశ్యాన్ని పసిగట్టే జగన్ తన పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తున్నాడు…… అంటూ రకరకాలుగా తన పార్టీ నాయకుల చేత, భజన మీడియాతో ప్రచారం చేయించుకుంటాడు. కానీ ఆచరణలో మాత్రం ఏమీ చేయడు. విభజన నాటి నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబుది ఇదే రాజకీయం. ఇక సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేసిన జగన్ సోనియాతో కుమ్మక్కయ్యాడని అబద్ధపు ప్రచారం చేయించడం…….. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పదవులు త్యాగం చేసి పోరాడతామంటున్న జగన్ మోడీతో కుమ్మక్కయ్యాడని జగన్ పోరాట విశ్వసనీయతను దెబ్బతీయడంలో మాత్రం సక్సెస్ అవుతున్నాడు. ఆ రకంగా సీమాంధ్ర ప్రజలు జగన్‌తో కలిసి పోరాడకుండా చేస్తూ……తాను కూడా పోరాటం చేయకుండా మీడియా రాజకీయాలు చేసుకుంటూ మొత్తం రాష్ట్రాన్నే కేంద్రం ముందు నవ్వుల పాలు చేస్తున్నాడు.

ఇప్పుడిక నిర్ణయం సీమాంధ్ర ప్రజల చేతుల్లోనే ఉంది. ఎవరివి గుంటనక్క వేషాలో…… నిజాయితీ ఎవరిదో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలను పరిశీలించగలిగే సామర్థ్యం ఉంటే చాలు. నిజాలు ఇట్టే తెలిసిపోతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -