Sunday, May 5, 2024
- Advertisement -

ట్విట్ట‌ర్‌లో చంద్ర‌బాబును క‌డిగేసిన‌ జ‌గ‌న్‌…

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మ‌రో సారి విరుచుకు ప‌డ్డారు. ఈసారి ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేందుకు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ హామీలు ఇచ్చాయని తెలిపారు. 2014 మార్చిలో దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసిందని… ప్లానింగ్ కమిషన్ కు ముసాయిదా కూడా వెళ్లిందని చెప్పారు.

అయితే స్పెష‌ల్ స్టేట‌స్‌ను కేంద్రం ద‌గ్గ‌ర బాబు ఎందుకు తాక‌ట్టుపెట్టారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌త్యేక‌హోదాను తుంగ‌లోకి తొక్కి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని జగన్ ప్రశ్నించారు. కంటితుడుపు చర్యలను చంద్రబాబు ఆపేయాలని… ఎందుకు అలా చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -