Thursday, May 23, 2024
- Advertisement -

విజయసాయిరెడ్డి ప్రశ్నలకు సమాధానాలు లేకే డొంక తిరుగుడు వేషాలా?

- Advertisement -

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి చిప్ప చేతికిచ్చింది మోడీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు రగలడంతో పచ్చ బ్యాచ్ మొత్తం డ్రామా షురూ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. సినిమాల్లోనూ నటించి ఒక ఎంపి డ్రామా వేషాలు అన్నీ వేస్తున్నాడు. ఇతర ఎంపిలు కూడా రకరకాలుగా హంగామా చేస్తున్నారు. ఇక పచ్చ మీడియా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహ జ్వాలలో చంద్రబాబు ఎక్కడ పతనమైపోతాడో అని జాకీలు పట్టుకుని బయల్దేరింది. ఈ మొత్తం షో పై వైకాపా ఎంపి విజయసాయిరెడ్డి ఒక ఘాటు ప్రశ్న వేశాడు.

రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజననాటి పరిస్థితులు, అన్యాయాలు అంటూ రెచ్చిపోయి ప్రసంగిస్తున్న సుజనా చౌదరిని ఒక్కటే ప్రశ్న అడిగాడు విజయసాయిరెడ్డి. ‘కేంద్ర కేబినెట్ మంత్రి సుజనాచౌదరి అన్యాయం అంటూ మాట్లాడుతున్న మాటలు ఎవరిని ఉద్ధేశ్యించి? ఎవరు అన్యాయం చేస్తున్నారని కేంద్ర కేబినెట్ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతున్నారు?’ అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. రూల్ బుక్ ప్రకారమే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఈ ప్రశ్న అడగడం వెనకాల చాలా అర్థమే ఉంది. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టకముందే కేబినెట్‌లో బడ్జెట్ గురించి సుదీర్ఘంగా చర్చిస్తారు. కేటాయింపులు ఎవరికి ఎలా ఉండాలి? ఏ శాఖకు ఎంత? ఏ రాష్ట్రానికి ఏంటి? అనే విషయాలు చర్చిస్తారు. ఆ కేబినెట్ సమావేశాల్లో టిడిపి కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు పాల్గొన్నారు. కేబినెట్ మొత్తం ఆమోదించాకే ఆ బడ్జెట్ పార్లమెంట్‌కి వస్తుంది. ఆ రకంగా కేబినెట్ మీటింగ్‌లో టిడిపి కేంద్ర కేబినెట్ మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు బడ్జెట్‌ని ఆమోదించారు. ఆ విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పారు. ప్రత్యేక హోదా అవసరం లేదు…..ప్యాకేజ్ చాలు అని అర్థ రాత్రి సమయంలో అతీగతిలేని ప్యాకేజ్‌కి ఒకే అని చెప్పి ఆంధ్రప్రదేశ్‌ని నిండా ముంచిన తరహాలోనే ఈ బడ్జెట్ విషయంలో కూడా మేనేజ్ చేయగలను అనుకున్నారు బాబుగారు. కాకపోతే చివరి సంవత్సరం కావడంతో……ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహం పతాక స్థాయికి చేరడంతో ప్లేట్ మార్చారు. ప్రజల మెప్పుకోసం పార్లమెంట్‌లో డ్రామా మొదలెట్టారు. ఆ డ్రామాకి పరాకాష్ట సుజనా ప్రసంగం. కేబినెట్ మీటింగ్‌లో బడ్జెట్‌ని ఆమోదించిన కేంద్ర కేబినెట్ మంత్రి సుజనా చౌదరి పార్లమెంట్‌లో మాత్రం టివిల్లో కనపడడం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో టిడిపిని, బాబుని హీరోని చేయడం కోసం పాచిపోయిన కాంగ్రెస్ అన్యాయం, నాలుగేళ్ళుగా అన్యాయం అంటూ మొదలెట్టారు. కేబినెట్‌లో బడ్జెట్‌ని ఆమోదించి ఇక్కడ డ్రామా ప్రసంగాలు చేయడం కరెక్ట్ కాదు గదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఈ ఒక్క ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా? సీమాంద్ర ప్రజలకు ఏం చెప్తాడు? మామూలుగా కూడా టిడిపి నేతలకు చంద్రబాబు ఎప్పుడూ ఓ మాట చెప్తూ ఉంటాడు. అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ కూడా మనమే అవ్వాలని చెప్తూ ఉంటాడు. అంటే కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో కూర్చుని బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం చేసేది వాళ్ళే……ఆ తర్వాత మళ్ళీ అన్యాయం అంటూ మాట్లాడేది కూడా వాళ్ళే. వాట్ ఏ డ్రామా సామీ…….రాష్ట్ర విభజన నాడు కూడా ఇవే శివప్రసాద్‌ వేషాలు, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేల డ్రామాలు, రెండు కళ్ళ సిద్ధాంతాలతో సీమాంధ్రను పూర్తిగా ముంచారు. అప్పటి వరకూ కిరణ్ కుమార్‌రెడ్డితో కుమ్మక్కయి….చిదంరబరంతో చీకటి మంతనాలు జరిపి(ఈ విషయాన్ని స్వయంగా చిదంబరమే పార్లమెంట్‌లో చెప్పాడు. టిడిపినేతలు కూడా ఒప్పుకున్నారు), సోనియా ప్రధాన కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో సుజనా చౌదరి మంతనాలు వీడియో సాక్ష్యంగా దొరికిపోయాయి…..టిడిపి-కాంగ్రెస్ బంధాన్ని హైదరాబాద్ సభ సాక్షిగా మోడీ కూడా బయటపెట్టాడు……ఇంతా చేసి విభజన అభాండాన్ని పచ్చ మీడియా విష ప్రచారం సాయంతో సమైక్యాంధ్ర కోసం తెలంగాణాను వదులుకుని నిరాహార దీక్ష చేసిన జగన్‌పైకి తోసేశారు. ఇక ఇప్పుడు కూడా అవే డ్రామాలు. అన్యాయం చేసేదీ వాళ్ళే……అన్యాయం అని డ్రామాలు చేస్తూ అన్యాయమైపోయిన ప్రజల మద్దతు పొందడానికి డ్రామాలు ఆడేది కూడా వాళ్ళే. మళ్ళీ మళ్ళీ అవే పచ్చ డ్రామాలు……2019లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ డ్రామాలను నమ్ముతారంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -