రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ఢిల్లీలో చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షపై వైసీపీనేత రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. బాబు చేస్తున్న దీక్ష రాష్ట్రప్రయేజనాలకోసం కాదని అది టీడీపీ ప్రయేజనాలకోసం అని విమర్శించారు. పెయిడ్ఆర్టిస్ట్లను తాబేదార్లను తీసుకువెళ్లి ప్రచారం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రభుత్వ ఖజానానుంచి కోట్ల రూపాయల నిధులు దుబారా చేశారన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే ఆ సమస్యను పరిస్కరింకుండా కోట్లాది రూపాయలతో ఢిల్లీలో దీక్షల పేరుతో డ్రామాలు చేస్తారా అంటూ మండిపడ్డారు.
ఏఐసీసీ కోశాధికారిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంతోపాటూ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పలు రాష్ట్రాలలో తన వల్లే గెలుపు జరిగిందని చంద్రబాబు స్వయంగా చెప్పారన్నారు. చంద్రబాబుతో కలసి తిరిగేందుకు రాహుల్‌కు పౌరుషం ఉందా? రాహుల్ తల్లిని, వంశాన్ని చంద్రబాబు తిట్టిన విషయం మరిచిపోయారా? అంటూ రాహుల్‌ను ప్రశ్నించారు. బాబు డ్రామాలు తెలిసే వామపక్షనేతలు ఢిల్లీ వెల్లలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు హడావిడి చూస్తుంటే భవిష్యత్ లో టీడీపీ కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశం కూడా లేకపోలేదన్నారు. మోదీ మీద వ్యతిరేకతతోనే దీక్షకు రాజకీయపార్టీల నాయకులు హజరయ్యారన్నారు.