ఐటీ మంత్రి లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖరారయ్యింది. 175 నియోజక వర్గాల్లో సేఫ్ ప్లేస్ ఏదో వెతుకులాటలో చిట్ట చివరకు సేఫ్ ప్లేస్ అయిన మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ఉన్నారు. తాజాగా తనపై లోకేష్ పోటీ చేయడంపై ఆర్కే స్పందించారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడం ఖాయం అన్నారు. మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు,లోకేష్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా రాజధాని ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మొహం పెట్టుకొని ఇక్కడ పోటీ చేస్తారని ప్రశ్నించారు.ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మున్సిపల్ వార్డు కూడా గెలుచుకోలేపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు,లోకేష్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రగిరిలో బాబు ఓడిపోయారని ఇప్పుడు మంగళగిరిలో కూడా లోకేష్ ఓడిపోవడం ఖాయమన్నారు. మంగళగిరి వచ్చి పానకాల స్వామి గుడినే మింగేస్తావా అని సెటైర్ వేశారు.
- Advertisement -
లోకేష్‌పై ఆర్కే అదిరిపోయే సెటైర్….
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -