Monday, June 17, 2024
- Advertisement -

ప‌వ‌న్ తోపాటు జేఎస్‌సీలో ఉన్న వాల్లంత పేయిడ్ ఆర్టిస్టులే…

- Advertisement -

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌ కోసం వైఎస్‌ఆర్‌సీపీ నడుంకట్టింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సంజీవని అని ఢిల్లీ గడ్డపై పోరాటం చేయడానికి సిద్ధమైంది. ఐదుకోట్ల ఆంధ్రులకు ప్రత్యేక హోదా సంజీవని అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ వేదికగా తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది. వైసీపీ చేప‌ట్టిన ధ‌ర్నాకు వామ‌ప‌క్షాలు,ప్ర‌జాసంఘాలు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు తెలిపాయి.

ధ‌ర్నాలో పాల్గొన్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బాబు, చంద్ర‌బాబుల‌పై నిప్పులు చెరిగారు. ప్రజలను మభ్యపెట్టేందుకే జనసేన పార్టీ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పేరిట నాటకం ఆడుతున్నదని, తెరవెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపిస్తున్నది చంద్రబాబునాయుడేనని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జేఎఫ్సీ దర్శకుడు, నిర్మాత చంద్రబాబేనని, పవన్, ఉండవల్లి తదితర సభ్యులంతా పెయిడ్ ఆర్టిస్టులని ఎద్దేవా చేశారు.

వైసీపీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ వైదొలగి, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జేఎఫ్సీతో ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డ ఆయన, కమిటీలు, నివేదికలతో ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటించిన తృతీయ కూటమిపై ఇప్పటివరకూ ఇంకా ఎటువంటి స్పష్టతా లేదని, కాబట్టి ఆ విషయంలో తమ పార్టీ ప్రస్తుతానికి స్పందించబోదని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -