Wednesday, May 7, 2025
- Advertisement -

20 శాతం బీటెక్ స్టూడెంట్లు కాలేజీల్లోనే అన్నీ కానిచ్చేస్తున్నారు!

- Advertisement -

దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అభ్యసిస్తున్న విద్యార్థుల సెక్సువల్ లైఫ్ గురించి ఒక లుక్ వేసింది ఒక సామాజిక సంస్థ. ప్రత్యేకించి చదువు, సెక్స్ వంటి అంశాల గురించి విద్యార్థుల స్వానుభవాల గురించి ఈ అధ్యయనం సాగింది. దీనిలో కొన్ని ఆశ్చర్యకరమైన.. ఆసక్తికరమైన ఫలితాలు వెలుగు చూశాయి.

ఈ సర్వే ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో దాదాపు 20 శాతం మంది ఆ నాలుగేళ్లలోనే అన్నీ కానించేస్తున్నారట! సెక్స్ అనుభవాలను పొందుతున్నారట. ఈ విషయాలను వారే చెప్పారని అధ్యయనకర్తలు అంటున్నారు. ర్యాండమ్ గా కొన్ని కాలేజీల పరిధిలో జరిపిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని వారు చెప్పారు. తమకు సెక్స్ అనుభవం ఉందని 20 శాతం అమ్మాయిలు, అబ్బాయిలు ఒప్పుకొన్నారు.

 

రహస్య పద్ధతిలో జరిగిన ఈ సర్వేలో 80 శాతం మంది తమకు ఎలాంటి బంధాలేమీ లేవని స్పష్టం చేశారు. వీరిని పక్కన పెడితే.. అనుభవాలు ఉన్నాయని ఒప్పుకొన్న యువతీయువకుల్లో కొంతమంది అయితే.. ఒకరికి మించిన స్థాయిలో తమకు సెక్స్ సంబంధాలున్నాయని చెప్పడం విశేషం. ఇలాంటి వారి సంఖ్య దాదాపు 10 శాతం వరకూ ఉంది. 2 శాతం మంది యువతీయువకులకు ఇద్దరు , ముగ్గురుతో కూడా శారీరక, ప్రేమ బంధాలున్నాయట! ఇలా ఉన్నాయి.. కళాశాలల్లోని పరిస్థితులు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -