Friday, April 19, 2024
- Advertisement -

సర్వే ఫలితాలు ఎవరికి లాభం ?

- Advertisement -

తెలంగాణలో రోజురోజుకూ పోలిటికల్ హిట్ పెరుగుతూ వస్తోంది. ప్రధాన పార్టీలుగా ఉన్న టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు గట్టిగానే పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా టి‌ఆర్‌ఎస్, బీజేపీ మద్య ఈ పోటీ మరింత బలంగా కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలం పెంచుకుంటూ ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే బీజేపీ నేతలు నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు గ్రాండ్ గా సక్సస్ కావడంతో ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చిన తాము సిద్దమే అన్న సంకేతాలను కూడా పంపిస్తున్నారు బీజేపీ నేతలు. ఇక టి‌ఆర్‌ఎస్ విషయానికొస్తే పార్టీలో మునుపటి దూకుడు లేదనే వాదనలు వినిపిస్తున్నప్పటికి వాటిని ఆ పార్టీ నేతలు ఖాతరు చేయడంలేదు. ఇటీవల సి‌ఎం కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు తాము సిద్దమే అనే హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టి‌ఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మద్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ప్రజలు ఎవరి వైపు తీర్పు ఇస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది. అయితే ప్రముఖ సర్వే సంస్థ ఆరా ఇటీవల ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మళ్ళీ టి‌ఆర్‌ఎస్ పార్టీనే ఆధిక్యంలో నిలిచే అవకాశం ఉంది.

టి‌ఆర్‌ఎస్ పార్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను సునాయసంగా దాటుతుందట. అంటే తెలంగాణలో ఉన్న 119 స్థానాలకు గాను దాదాపు 87 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని అరా సర్వే సంస్థ తెలిపింది. ఇక కాంగ్రెస్ కు 53, బిజెపీకి 29 స్థానాలు దక్కే అవకాశం ఉందట. అయితే ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో హవా కొనసాగిస్తున్నప్పటికి, సర్వే ఫలితాల ప్రకారం బీజేపీ కంటే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు దక్కడం ఆసక్తికలిగించే అంశం. అయితే ఈ సర్వే ఫలితాల ఆధారంగానే ప్రజల అభిప్రాయాలూ ఉంటాయి అనుకోవడం అతిశయోక్తే అవుతుంది. ఎన్నికల సమయంలో ప్రజల అనూహ్యమైన తీర్పులు.. ఆయా పార్టీలకు షాక్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలా చూస్తే ఈ సర్వే ఫలితాల వల్ల పెద్దగా ఉపయోగం లేదనేది కదనలేని వాస్తవం.

Also Read

బాబు చూపు .. బీజేపీ వైపు ?

పవన్ కలవరం.. అందుకేనా ?

ఆధిపత్యం కోసం పోరు.. గెలుపెవరిది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -