ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

- Advertisement -

సినిమా ఒక మాయాజాలం ఇందులో నటించే పాత్రలు ఓ కల్పితం… అందులో ఎన్నో ప్రేమకథా సినిమాలు. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎందుకు పడుతుందో తెలియదు కాని సినిమాలో ప్రేమించి పెళ్ళి చెసుకున్న కొంత మంది నటీ, నటులు నిజ జీవితంలో కూడా ప్రేమలో పడ్డారు అలా సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించి.. రియల్ లైఫ్ లో పెళ్లిలు చేసుకున్న జంటలను ఇప్పుడు చూద్దాం.

  • కృష్ణ – విజయ నిర్మల: ‘సాక్షి’ చిత్రంలో జంటగా నటించిన కృష్ణ, విజయ నిర్మల.. ప్రేమ పడ్డారు. అప్పటికే వీరికి పెళ్ళైనప్పటికీ మళ్ళీ వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇంకా ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు.
  • రాజశేఖర్ – జీవిత: ‘తలంబ్రాలు’ ‘అంకుశం’ వంటి చిత్రాల్లో భార్యా భర్తలుగా నటించిన రాజ శేఖర్, జీవిత లు.. ఆ తరువాత నిజంగానే పెళ్లి చేసుకుని జంటగా మారారు.
  • నాగార్జున – అమల: ‘శివ’ ‘నిర్ణయం’ వంటి సినిమాల్లో జంటగా నటించిన నాగార్జున- అమల నిజ జీవితంలో కూడా వివాహం చేసుకుని జంటగా మారిన సంగతి తెలిసిందే.

  • శ్రీకాంత్ – ఊహ: ‘ఆమె’ చిత్రం టైంలోనే శ్రీకాంత్, ఊహ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళ తరువాత పెళ్లి చేసుకుని జంటగా మారారు.
  • మహేష్ బాబు – నమ్రత: ‘వంశీ’ సినిమాలో జంటగా నటించిన మహేష్, నమ్రత.. నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకుని జంటగా మారిరారు.
  • పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్: ‘బద్రి’ ‘జానీ’ సినిమా టైంలోనే ప్రేమలో పడిన ఈ జంట.. తరువాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకున్నారు. అయితే అటు తరువాత విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే..!
- Advertisement -

  • శివ బాలాజీ – మధుమిత: ఓ తమిళ్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ.. నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకున్నారు.
  • వరుణ్ సందేశ్ – వితిక షెరు: ‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడి.. తరువాత పెళ్లి చేసుకుని జంటగా మారారు.
  • నాగ చైతన్య – సమంత: ‘చైసామ్’ ఈ కపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఏమాయ చేసావే’ ‘మనం’ చిత్రాల్లో జంటగా నటించిన ఈ జంట.. నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకున్నారు.

  • ఆర్య – సయేషా సైగల్: సయేషా ‘అఖిల్’ అనే తెలుగు చిత్రం ద్వారానే హీరోయిన్ గా మారింది. హీరో ఆర్య గురించి మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ ‘గజినీకాంత్’ అనే చిత్రంలో జంటగా నటించి.. నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుని జంటగా మారారు.
  • సూర్య – జ్యోతిక: ‘కాకా కాకా’ అనే చిత్రంలో జంటగా నటించిన సూర్య, జ్యోతిక ఆ తరువాత.. నిజంగానే పెళ్లి చేసుకుని జంటగా మారారు.తరువాత ‘నువ్వు నేను ప్రేమ’ అనే చిత్రంలో కూడా వీరు భార్యా భర్తలుగా కనిపించారు.
  • అర్జున్ షార్జా – నివేదిత: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యాక్షన్ కింగ్ అర్జున్ కూడా తన సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదితను పెళ్లి చేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -