మహాసముద్రం విడుదల వాయిదా..?

- Advertisement -

యంగ్ హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే ఆ సినిమా ప్రస్తుతం ఆ డేట్ కి విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం.

కరోనా వ్యాప్తికి కారణం గా ఏ సినిమా షూటింగ్ కొద్దిరోజులు నిలిచిపోయింది. దీంతో అనుకున్న తేదీకి సినిమా విడుదల చేయడం భావించిన మేకర్స్ దీనిని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. యువ హీరో సిద్ధార్థ్ చాలా ఏళ్ళ విరామం అనంతరం తెలుగులో నేరుగా నటిస్తున్నారు.

Also Read

ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !

వరుణ్​తేజ్​ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా..!

మునుపెన్నడూ లేనంతగా బాలయ్య లైనప్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -